PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpg ఎమ్మెల్సీ ఎన్నిక‌లను టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది. న‌ల్గొండ‌, హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీకి టీఆర్ ఎస్ పార్టీ నుంచి అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. న‌ల్గొండ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి నామినేష‌న్ కూడా వేసేశాడు. హైదరాబాద్ స్థానం నుంచి పీవీ వాణిని బ‌రిలోకి దించుతున్న‌ట్లుగా ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాధ్య‌త త‌మ‌ది కాద‌న్న‌ట్లుగా ఎమ్మెల్యేలు వ్యkcr;view;kcr;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;partyప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీల‌క సమావేశం.. ఆవిష‌యంపై హాట్ హాట్ చ‌ర్చ‌....ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీల‌క సమావేశం.. ఆవిష‌యంపై హాట్ హాట్ చ‌ర్చ‌....kcr;view;kcr;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;partyMon, 22 Feb 2021 10:53:30 GMTఎమ్మెల్సీ ఎన్నిక‌లను టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది. న‌ల్గొండ‌, హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీకి టీఆర్ ఎస్ పార్టీ నుంచి అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. న‌ల్గొండ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి నామినేష‌న్ కూడా వేసేశాడు. హైదరాబాద్ స్థానం నుంచి పీవీ వాణిని బ‌రిలోకి దించుతున్న‌ట్లుగా ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాధ్య‌త త‌మ‌ది కాద‌న్న‌ట్లుగా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావ‌డంతో అధిష్ఠానం ఈ ప‌రిణామాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటోంది.


అందుకే పార్టీ ఎమ్మెల్యేల‌తో వెంట‌నే స‌మావేశంలో ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈమేర‌కు హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే సమావేశానికి ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు హాజ‌రు కానున్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు కేసీఆర్‌. రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్‌ పిలుపుతో ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.
 

వాణీదేవి..  ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ప్రచారాన్ని ప్రారంభించగా... ఒక్క స్థానానికి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటన ఆలస్యమైంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ.. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావునే మళ్లీ బరిలోకి దింపింది. వాణిదేవిని బ‌రిలోకి దించ‌డంతో టీఆర్ ఎస్ బ‌లంగా క‌న‌బ‌డుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లు పోటీనే చేయ‌మ‌న్న స్థితి నుంచి పోటీలో తామే ముందున్న అనే స్థితికి టీఆర్ ఎస్ పార్టీ చేరుకుంద‌ని ఆ పార్టీ అభిమానులు పేర్కొంటున్నారు.అయితే ఈ స్థానం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్ ఒక్కసారి కూడా గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఈ స్థానంలో ఈ సారి ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ఆ పార్టీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.







కరోనాతో ఇక సహజీవనమే!

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>