PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/how-did-the-galvan-river-become-a-hot-spota928f123-5b66-4918-ac52-220d9840272a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/how-did-the-galvan-river-become-a-hot-spota928f123-5b66-4918-ac52-220d9840272a-415x250-IndiaHerald.jpgభారత్, చైనాల మధ్య ఘర్షణల తర్వాత ప్రశాంతంగా ఉండే గాల్వాన్‌ నది హాట్‌స్పాట్‌గా మారింది. చైనా, భారత ఆర్మీ ఈ ప్రాంతం వేదికగానే ఢీ అంటే ఢీ అన్నాయి. గాల్వాన్ లోయ ప్రాంతం తమదేనని చైనా చెప్పుకుంది. అక్కడి స‌రిహ‌ద్దు చాలా స్పష్టంగా ఉన్నాయని అధికారిక మీడియాలో కథనాలు ప్రచురించింది. గాల్వాన్ లోయ‌లోకి భార‌త్ సైన్యమే అక్రమంగా ప్రవేశించిన‌ట్లు ఆరోపిస్తోంది. అయితే భారత్‌ మాత్రం ఒక్క అంగుళం కూడా వదులుకోమని తేల్చి చెప్పింది. తమ భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. how did the galvan river become a hot spot;pratishta;india;army;juneగాల్వాన్ నది హాట్ స్పాట్ ఎలా అయింది..?గాల్వాన్ నది హాట్ స్పాట్ ఎలా అయింది..?how did the galvan river become a hot spot;pratishta;india;army;juneMon, 22 Feb 2021 14:00:00 GMTభారత్, చైనాల మధ్య ఘర్షణల తర్వాత ప్రశాంతంగా ఉండే గాల్వాన్‌ నది హాట్‌స్పాట్‌గా మారింది. చైనా, భారత ఆర్మీ ఈ ప్రాంతం వేదికగానే ఢీ అంటే ఢీ అన్నాయి. గాల్వాన్ లోయ ప్రాంతం తమదేనని చైనా చెప్పుకుంది. అక్కడి స‌రిహ‌ద్దు చాలా స్పష్టంగా ఉన్నాయని అధికారిక మీడియాలో కథనాలు ప్రచురించింది. గాల్వాన్ లోయ‌లోకి భార‌త్ సైన్యమే అక్రమంగా ప్రవేశించిన‌ట్లు ఆరోపిస్తోంది. అయితే భారత్‌ మాత్రం ఒక్క అంగుళం కూడా వదులుకోమని తేల్చి చెప్పింది. తమ భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎల్‌ఏసీ వద్ద ప్రతిష్టంభణలపై చర్చల ద్వారా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అంతే కాదు పలుమార్లు కార్ప్‌కమాండర్‌ స్థాయిలో చర్చలు కూడా జరిగాయి.

జూన్ 22 నాటి చర్చల్లో గాల్వన్ లోయ,  గోగ్రా-హాట్‌స్ప్రింగ్, పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైన్యాలు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి కనీసం 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర వెనక్కువెళ్లాలని నిర్ణయించాయి. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో ఫింగర్ 4 నుంచి 8, గాల్వన్ లోయ పెట్రోలింగ్ పాయింట్ 14, దెప్సాంగ్ వద్ద బాటిల్‌నెక్ నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలు వైదొలగాలని భారత్‌ డిమాండ్ చేసింది. ఇరుదేశాలు ప‌లు ధ‌పాలుగా చ‌ర్చలు నిర్వహించాయి. చివ‌ర‌కు చ‌ర్చలు ఫ‌లించ‌డంతో ఇరుదేశాలు స‌రిహ‌ద్దుల నుంచి బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ సరిహద్దు వివాదం భారత్, చైనాల మధ్య నడుస్తోంది. సరిహద్దులకు అవతల ఉన్న ప్రాంతాలు తమవంటే తమవని రెండు దేశాలూ చెబుతున్నాయి. 3400 కి.మీ. పొడవైన ఈ సరిహద్దుల్లో చాలాచోట్ల నదులు, సరస్సులు, మంచు కొండలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నిర్దిష్టమైన సరిహద్దు నిర్ణయించడం కష్టమవుతోంది. ఇదే రెండు దేశాల భద్రతా సిబ్బంది ఎదురురెదురు పడటానికి కారణం అవుతోంది. కొన్నిసార్లు ఘర్షణలకూ దారితీస్తోంది. 


నమస్కారం పెట్టేసిన లోకేష్...!

పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!

ఎడిటోరియల్: తెగించిన తెలంగాణ పాలకులు-ఇంత జరిగినా శాంతి భద్రలపై స్పందన కరువు-పాలన ఉన్నంతవరకు దోపిడీకి యథేచ్చేనా?

నటి లయ నేషనల్ చెస్ ఛాంపియన్ అని మీకు తెలుసా..!

పురపోరు: మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్

అదిరిపోయే సబ్జెక్ట్ తో విజయశాంతి సినిమా...?

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>