PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan35038c4f-238a-4fdb-93e2-68d1c35bdc80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan35038c4f-238a-4fdb-93e2-68d1c35bdc80-415x250-IndiaHerald.jpg విపక్షాలకు పేరు రావాలంటే ప్రజాఉద్యమాలు చేయాలి.. ప్రజా ఉద్యమాలు చేయాలంటే సరైన అంశం దొరకాలి.. అలా కొన్నిరోజుల క్రితం టీడీపీ చేతికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం చేరింది. అయితే దీన్ని విపక్షం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి.. తెలుగు దేశంలో ఎందరో పేరున్న నాయకులు ఉన్నా.. ఓ స్థానిక నాయకుడితో నిరాహర దీక్ష చేయించి ఓ అస్త్రాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఆ ఛాన్స్ బాగా ఉపయోగించుకుంటోంది. jagan;view;cbn;telugu desam party;jagan;v vijayasai reddy;mp;steel plant;vishakapatnam;letter;tdp;local language;central government;ycp;aaviri;reddyస్టీల్‌ ఫైట్‌ : టీడీపీ ఆశలు ఆవిరి చేసిన వైసీపీ వ్యూహం..?స్టీల్‌ ఫైట్‌ : టీడీపీ ఆశలు ఆవిరి చేసిన వైసీపీ వ్యూహం..?jagan;view;cbn;telugu desam party;jagan;v vijayasai reddy;mp;steel plant;vishakapatnam;letter;tdp;local language;central government;ycp;aaviri;reddySun, 21 Feb 2021 08:15:40 GMTటీడీపీ చేతికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం చేరింది. అయితే దీన్ని విపక్షం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి.. తెలుగు దేశంలో ఎందరో పేరున్న నాయకులు ఉన్నా.. ఓ స్థానిక నాయకుడితో నిరాహర దీక్ష చేయించి ఓ అస్త్రాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఆ ఛాన్స్ బాగా ఉపయోగించుకుంటోంది.


అందరికంటే ముందే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు.. ఇప్పుడు విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కు కోసం పాదయాత్ర అంటూ హడావిడి చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వమంటున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయ‌స్సార్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు వైసీపీ బాగానే జనసమీకరణ చేసింది.


విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న భావోద్వేగ నినాదాలతో హోరెత్తించారు. "ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. పోస్కో ప్రతినిధులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిస్తే..విశాఖలో తప్ప మరోచోట ఎక్కడైనా పెట్టుకోవాలని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమే. స్టీల్‌ప్లాంట్‌కున్న రుణభారం రూ.25వేల కోట్లు. రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తి స్థిరీకరణ చాలా అవసరం.. ఉత్పత్తి ఆగితే నష్టాలు మరింత పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆగకూడదు. స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న పైఅధికారులు మనరాష్ట్రం వారు కాదు. వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.


"చంద్రబాబుకు చిత్తుశుద్ధి ఉంటే ప్రధానిని కలవాలి. ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదు. కార్మిక సంఘాలకు పూర్తి భరోసాగా ఉంటాం .. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం పోరాడుతాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తాం.. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని విజయసాయిరెడ్డి అంటున్నారు.  మొత్తానికి టీడీపీ ఈ విషయంలో మైలేజీ తెచ్చుకునే అవకాశం ఉన్నా దూకుడు ప్రదర్శించలేకపోయింది.  


ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లపై నిమ్మ‌గ‌డ్డ ఇచ్చే ట్విస్ట్ ఇదే

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>