PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandra-babud50ee0fe-a40e-45a4-b5e2-1f4bc34224cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandra-babud50ee0fe-a40e-45a4-b5e2-1f4bc34224cb-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే సీఎం జగన్ లేఖ రాసిన 15 రోజుల తర్వాత హడావిడిగా ఇప్పుడే ఆయన ఎందుకు లేఖ రాశారన్నదే సస్పెన్స్. వాస్తవానికి చంద్రబాబుని లేఖ రాయాలంటూ అధికార వైసీపీ చాన్నాళ్లుగా ఒత్తిడి చేస్తూ ఉంది. అయితే మోదీని పల్లెత్తు మాట అనని చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. chandra babu;cbn;srinivas;jagan;narendra modi;రాజీనామా;industries;vishakapatnam;government;prime minister;letter;tdp;central government;ycp;narendraవిజయసాయి పాదయాత్రతో బాబు భయపడ్డారా..?విజయసాయి పాదయాత్రతో బాబు భయపడ్డారా..?chandra babu;cbn;srinivas;jagan;narendra modi;రాజీనామా;industries;vishakapatnam;government;prime minister;letter;tdp;central government;ycp;narendraSun, 21 Feb 2021 07:00:00 GMTవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే సీఎం జగన్ లేఖ రాసిన 15 రోజుల తర్వాత హడావిడిగా ఇప్పుడే ఆయన ఎందుకు లేఖ రాశారన్నదే సస్పెన్స్. వాస్తవానికి చంద్రబాబుని లేఖ రాయాలంటూ అధికార వైసీపీ చాన్నాళ్లుగా ఒత్తిడి చేస్తూ ఉంది. అయితే మోదీని పల్లెత్తు మాట అనని చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

తాజాగా విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్రతో ఒక్కసారిగా రాజకీయం మారినట్టు తెలుస్తోంది. జనాల్ని తరలించారో, లేక స్వచ్ఛందంగా వచ్చారో తెలియదు కానీ.. భారీగా జన సమీకరణ జరిగింది. దీంతో టీడీపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ రాసినప్పుడు కూడా ఇంత స్పందన రాలేదు, పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్షకి కూడా ఈ రేంజ్ లో స్పందన రాలేదు. తీరా ఇప్పుడు విజయసాయిరెడ్డి పాదయాత్రకు జనం భారీగా తరలి రావడంతో చంద్రబాబులో అంతర్మథనం మొదలైంది. దీంతో హడావిడిగా కేంద్రానికి లేఖ రాశారు.

చంద్రబాబు రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేకపోవడం విచిత్రం. గతంలో సీఎం జగన్ తన లేఖలో ప్రస్తావించిన అంశాలనే మరోసారి హైలెట్ చేశారు. సొంత గనులు లేకపోవడం, రుణాలపై అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం వల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ సొంత గనుల్ని కేటాయిస్తే పరిశ్రమ మళ్లీ లాభాల బాట పడుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా తెలుగు ప్రజలంతా ఏకతాటిపై నిలిచి పోరాడి, 32 మంది బలిదానంతో సాకారమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయవద్దని వ్యక్తిగతంగానూ, రాష్ట్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రైవేటీకరణ కాకుండా..  ప్రత్యామ్నాయ మార్గాలు చూడండని కోరారు బాబు.

విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి భూములిచ్చిన వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని కోరారు చంద్రబాబు. 16 వేల కుటుంబాలు ఉక్కు కర్మాగారం కోసం భూములివ్వగా.. ఇప్పటి వరకు కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారని గుర్తు చేశారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం రూ.1,333 కోట్లతో ప్లాంట్‌ పునర్ ‌వ్యవస్థీకరణ ప్యాకేజీ ప్రకటించిందని, దానివల్ల ప్లాంట్ లాభాల్లోకి వచ్చిందని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా ప్లాంట్ పై సానుకూలంగా స్పందించాలని సూచించారు చంద్రబాబు. 


పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>