MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mumaith-khan28461a67-d0e6-4fb8-b6c3-aabf226bd37f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mumaith-khan28461a67-d0e6-4fb8-b6c3-aabf226bd37f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అందర్నీ నిద్ర లేకుండా చేసిన హాట్ ఐటమ్ బ్యూటీ ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్టెప్పులేసిన ఈ భామ.. ఆ ఒక్క పాటతో ఎంతో పాపులర్ అయిపోయింది.. ఇక ఈమె హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఐటెం సాంగ్స్‌తో యూత్ ని ఉర్రూతలూగించింది. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది ముమmumaith khan;beauty;mahesh;balakrishna;mumaith khan;bhama;omkar;puri jagannadh;tollywood;cinema;telugu;bigboss;rajani kanth;nandamuri balakrishna;television;tamil;kannada;car;hindi;interview;ohmkar;nandamuri taraka rama rao;pokiriకోమాలో ముమైత్ ఖాన్.. బాలయ్య సినిమా షూటింగ్ లో తీవ్ర గాయాలు..!!కోమాలో ముమైత్ ఖాన్.. బాలయ్య సినిమా షూటింగ్ లో తీవ్ర గాయాలు..!!mumaith khan;beauty;mahesh;balakrishna;mumaith khan;bhama;omkar;puri jagannadh;tollywood;cinema;telugu;bigboss;rajani kanth;nandamuri balakrishna;television;tamil;kannada;car;hindi;interview;ohmkar;nandamuri taraka rama rao;pokiriSun, 21 Feb 2021 16:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అందర్నీ నిద్ర లేకుండా చేసిన హాట్ ఐటమ్ బ్యూటీ ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్టెప్పులేసిన ఈ భామ.. ఆ ఒక్క పాటతో ఎంతో పాపులర్ అయిపోయింది.. ఇక ఈమె హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఐటెం సాంగ్స్‌తో యూత్ ని ఉర్రూతలూగించింది. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది ముమైత్‌.ఇక ఇప్పుడు ఈమె సినిమాల్లో కనిపించకపోయినా.. టీవీ షోలు చేస్తోంది.

తెలుగు బిగ్ బాస్ షోలో కూడా మెరిసింది. ప్రస్తుతం ఓంకార్ నిర్వహిస్తున్న డ్యాన్స్ ప్లస్ అనే షోలో ముమైత్ ఓ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తాను కోమాలో ఉన్న విషయం, నాడు జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.ముమైత్ మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా షూటింగ్ సమయంలో సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో జారిపడిపోయాను దాంతో తలకు తీవ్రగాయం అయ్యింది.

ఆ సమయంలో 15 రోజులపాటు కోమాలోకి వెళ్ళాను. రెండు రోజులపాటునా తలనుంచి రక్తం కారుతూనే ఉంది. బంధువులు తానిక బతకడం కూడా కష్టమే అనుకున్నారు. డాక్టర్స్ 3 ఏళ్ల వరకు రెస్ట్ తీసుకోమన్నాంరు. కానీ నేను మూడునెలలకే తిరిగి షూటింగ్స్ మొదలు పెట్టా అంటూ ఎమోషన్ అయింది..అయితే ఈ విషయం గురించి ముమైత్ చెప్పేదాకా ఎవ్వరికీ తెలియక పోవడం గమనార్హం.. ఇక ప్రస్తుతం ముమైత్ ఖాన్ బుల్లితెర టీవీ చానల్ స్టార్ మాలో ప్రసరమౌతున్న డాన్స్ ప్లస్ అనే షో లో ఓ జడ్జి గా వ్యవహరిస్తోంది..ఇక మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వస్తే నటించాలనుకుంటోంది ఈ ఐటమ్ భామ..!!


రేసుగుర్రం బృందంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...!?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>