Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaf166484e-8fae-408e-baf4-091e59aaaaa6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaf166484e-8fae-408e-baf4-091e59aaaaa6-415x250-IndiaHerald.jpgగతేడాది కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ బోసిపోయింది. 2020 లో కొంతమంది హీరోలు మాత్రమే తమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెజార్టీగా అయితే చాలా మంది కుర్ర, సీనియర్ హీరోలు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వన్స్ లాక్ డౌన్ పూర్తవ్వడమే ఆలస్యం.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాల జోరు ఊపందుకుంది. చిన్నా.. పెద్దా హీరోలంటూ తేడా ఏమీ లేకుండా వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇక వీరి కోసం డైరెక్టర్లు తొందర తొందరగా స్క్రిప్టులను రెడీ చేసేసి తమ హీరోలతో సినిమాలను తెరకెకక్కించేస్తూ.. ప్రేక్షకులను అలరించేస్తూనేbalakrishna;balakrishna;irrfan khan;kareena kapoor;boyapati srinu;chinna;madan;radhika;cinema;2020;film industry;industry;remake;director;hero;dookuduఅయ్యబాబోయ్.. సీక్రేట్ గా బాలయ్య బాబు బాగానే ప్లాన్ వేశారే.. కానీ నెటిజన్లు గమనిస్తూనే ఉన్నాగా..అయ్యబాబోయ్.. సీక్రేట్ గా బాలయ్య బాబు బాగానే ప్లాన్ వేశారే.. కానీ నెటిజన్లు గమనిస్తూనే ఉన్నాగా..balakrishna;balakrishna;irrfan khan;kareena kapoor;boyapati srinu;chinna;madan;radhika;cinema;2020;film industry;industry;remake;director;hero;dookuduSun, 21 Feb 2021 10:00:00 GMTసినీ ఇండస్ట్రీ బోసిపోయింది. 2020 లో కొంతమంది హీరోలు మాత్రమే తమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెజార్టీగా అయితే చాలా మంది కుర్ర, సీనియర్ హీరోలు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వన్స్ లాక్ డౌన్ పూర్తవ్వడమే ఆలస్యం.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాల జోరు ఊపందుకుంది. చిన్నా.. పెద్దా హీరోలంటూ తేడా ఏమీ లేకుండా వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇక వీరి కోసం డైరెక్టర్లు తొందర తొందరగా స్క్రిప్టులను రెడీ చేసేసి తమ హీరోలతో సినిమాలను తెరకెకక్కించేస్తూ.. ప్రేక్షకులను అలరించేస్తూనే ఉన్నారు. ఇక ఈ దూకుడులో కుర్రకారుకు ఏ మాత్రం తగ్గకుండా సీనియర్ స్టార్ హీరో బాలయ్య బాబు కూడా.. తన సినిమాల లీస్ట్ ను పెంచేస్తూ వెళుతున్నాడు.
 తన దగ్గరకు స్క్రిప్టుతో వచ్చిన ఏ ఒక్క డైరెక్టర్ ను డిసప్పాయింట్ చెయ్యకుండా.. కథ నచ్చితే చాలు ఓకే.. ఓకే.. సినిమా తీసేద్దాం.. అదేముంది అంటూ ఎనర్జిటిక్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. సీనియర్ హీరో అయినా ఏ మాత్రం నీరసం చెందకుండా.. రెట్టింపు ఉత్సాహంతో భారీ యాక్షన్ సినిమాల్లో పాల్గొంటున్నారు ఈ నటసింహం. తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు బాలయ్య ఓన్నో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో ఎన్నటికీ చెరగని ముద్రను వేసుకున్నాడు. కుర్ర హీరోల ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా.. వారికీ పోటీగా సినిమాల్లో నటిస్తూ వెళుతున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్నఈ మూవీ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడమే ఆలస్యం బాలయ్య మరో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్స్ వేస్తున్నాడట. అది కూడా రీమేక్ మూవీ. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. ఇర్ఫాన్ ఖాన్, రాధిక మదన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇంగ్లీష్ మీడియం’ మూవీని రీమేక్ చేసే దిశగా బాలయ్య ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఇంగ్లీష్ మీడియం మూవీని కాస్తా‘తెలుగు మీడియం’ పేరుతో రీమేక్ చెయ్యాలనుకుంటున్నట్టు సమాచారం.  అయితే ఈ మూవీలో తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తెరకెక్కించాలని బాలయ్య చూస్తున్నారట. ఈ వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.


నానీకి ఈ చికాకులు ఏంటీ...? బాబు కావాలనే సైలెంట్ గా ఉన్నారా...?

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి

పురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>