Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ration-atmd73b051e-1934-4a53-95c7-a01a2f04551b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ration-atmd73b051e-1934-4a53-95c7-a01a2f04551b-415x250-IndiaHerald.jpg: ప్రజలకు రేషన్ బియ్యాన్ని సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇక నుంచి ఎక్కడికో వెళ్లి క్యూలైన్లలో నిలబడి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా రేషన్ ఏటీఎంలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాలను దీనికోసం ఎంపిక..ration atm;amala akkineni;delhi;ahmedabad;gujarat - gandhinagar;letter;local language;central governmentఇక దేశం అంతటా రేషన్ ఏటీఎం.. ఎక్కడ కావాలంటే అక్కడ..!ఇక దేశం అంతటా రేషన్ ఏటీఎం.. ఎక్కడ కావాలంటే అక్కడ..!ration atm;amala akkineni;delhi;ahmedabad;gujarat - gandhinagar;letter;local language;central governmentSun, 21 Feb 2021 21:59:39 GMTన్యూఢిల్లీ: ప్రజలకు రేషన్ బియ్యాన్ని సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇక నుంచి ఎక్కడికో వెళ్లి క్యూలైన్లలో నిలబడి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా రేషన్ ఏటీఎంలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాలను దీనికోసం ఎంపిక చేసింది. ఆయా నగరాల్లో తొలుత వీటిని ఏర్పాటు చేసి.. ఆ తరువాత మిగిలిన నగరాలకు కూడా వీటిని తీసుకెళ్లాలని యోచన చేస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్‌లో విధానంలో భాగంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా కొత్త ఏడాది నుంచి సరికొత్త విధానాలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. అంతేకాకుండా గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చుని రేషన్ సరుకులు తీసుకునే పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు ఓ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే రేషన్ ఏటీఎంలు.. అంటే ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్(ఏజీడీఎం)లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లూ ఏటీఎంల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటూ వచ్చామో.. ఈ రేషన్ ఏటీఎంల నుంచి ఇక నుంచి బియ్యం, ఇతర సరుకులను అలానే తీసుకోవచ్చు. ముఖ్యంగా బియ్యం, గోధుమల కోసం ఈ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు.
 
పేద ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లకుండానే ఈ మిషన్లను ద్వారా సరుకులను పొందే అవకాశం తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా రేషన్ సరుకులు పొందుతున్న దాదాపు 81 కోట్ల మందికి కొత్త రేషన్ కార్డులు లభించనున్నాయని చెప్పారు. అలాగే ఏటీఎం కార్డును పోలిన విధంగా ఉంటే స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారులకు చేరవేస్తామన్నారు. వాటిని వినియోగించి ఈ ఏటీఎంల ద్వారా సరుకులు తీసుకోవడం మరింత సులభమవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే రేషన్ షాపుల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా బియ్యం, గోధుమలు తీసుకోవచ్చని, ఇక, రైస్ ఏటీఎంల వల్ల బియ్యం, గోధుమలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలోనే సేకరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని, దీనివల్ల రవాణా ఖర్చు తగ్గుతుందని పాండే తెలిపారు. అలాగే కాలం చెల్లిన గోదాముల స్థానంలో ఉక్కు గాదెలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


మజ్జిగ చేసే మేలు తెలిస్తే... అస్సలు వదలరు..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>