Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/shigella-virus0a7e4b95-e15a-4f2e-95eb-051ed5c6583f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/shigella-virus0a7e4b95-e15a-4f2e-95eb-051ed5c6583f-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఇప్పటికే అతలాకుతలం అయిపోయింది. ఇప్పడిప్పుడే కొద్దిగా కోలుకుంటోంది. వ్యాక్సిన్ల పుణ్యమా అని ఆ వైరస్‌ను నిరోధించగలమనే ఆశ కలుగుతోంది. అయితే ఇప్పడు కరోనాను మించిన మరో మహమ్మారి వైరస్ బయటపడింది. అది కూడా తొలి కేసు మన దేశంలోనే నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో రోజుకో రకం కొత్త వైరస్ ఎక్కడో చోట పుట్టుకొస్తూ ప్రజలకు..shigella virus;manu;india;kozhikode;district;doctorదేశంలోకి మరో కొత్త వైరస్.. ఇప్పటికే మరణాలు కూడా..దేశంలోకి మరో కొత్త వైరస్.. ఇప్పటికే మరణాలు కూడా..shigella virus;manu;india;kozhikode;district;doctorSun, 21 Feb 2021 21:42:51 GMTఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఇప్పటికే అతలాకుతలం అయిపోయింది. ఇప్పడిప్పుడే కొద్దిగా కోలుకుంటోంది. వ్యాక్సిన్ల పుణ్యమా అని ఆ వైరస్‌ను నిరోధించగలమనే ఆశ కలుగుతోంది. అయితే ఇప్పడు కరోనాను మించిన మరో మహమ్మారి వైరస్ బయటపడింది. అది కూడా తొలి కేసు మన దేశంలోనే నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో రోజుకో రకం కొత్త వైరస్ ఎక్కడో చోట పుట్టుకొస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణ రష్యాలో మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకుతుందని నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటికే బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న భారత్ మరింత అప్రమత్తం కావల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మరో కొత్త వైరస్ మన దేశంలో వెలుగు చూడడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేగుతున్నాయి.

కేరళలోని పాలక్కడ్‌లో ఏడాది వయసు కలిగిన చిన్నారిలో తొలిసారిగా షిగెల్లా వైరస్‌ను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 ఇది సాంక్రమిక బ్యాక్టీరియా అని, ఈ షిగెల్లా వైరస్ బారిపడిన వ్యక్తులకు తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే ఈ 'షిగెల్లా' వైరస్ వల్ల 11 ఏళ్ల చిన్నారి కేరళలోరి కోజికోడ్‌లో మృతిచెందాడు.
 
ఆ బాలుడు రెండు రోజుల క్రితం షిగెల్లాతో ప్రాణాలు కోల్పోగా.. ఆ చిన్నారితో సన్నిహితంగా మెలిగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. 'షిగెల్లా' లక్షణాలైన.. జ్వరం, అతిసారం, కడుపులో తిప్పడం వంటి సమస్యలతో దాదాపు 20 మంది శనివారం వివిధ ఆస్పత్రుల్లో చేరినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. బాలుడు మృతిచెందిన తర్వాత ఆ చిన్నారితో కలిసి తిరిగిన మరికొందరు చిన్నారులు కూడా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని కోజికోడ్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ తెలిపారు.

ఇదిలా ఉంటే షిగెల్లా వైరస్ ఇంతకుముందు కూడా కేరళలో కనిపించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గతేడాది కీజపయూర్‌లోని వెస్ట్ లోయర్ ప్రైమరీ పాఠశాలలోని 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారని, వారిలో ఇద్దరు విద్యార్థులకు షిగెల్లా నిర్ధారణ అయిందని వారు చెబుతున్నారు. అయితే చికిత్స తర్వాత వారిద్దరూ కోలుకున్నారని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా నీటిలో ఉన్నట్టు అధికారులు అప్పట్లో గుర్తించారు. 


మజ్జిగ చేసే మేలు తెలిస్తే... అస్సలు వదలరు..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>