HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/athi-nidhra-karanaga-eaduriye-samasayalu-eanto-telusaa2daaf43-1f45-420c-8688-939684b10262-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/athi-nidhra-karanaga-eaduriye-samasayalu-eanto-telusaa2daaf43-1f45-420c-8688-939684b10262-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనలో చాలా మంది రాత్రిళ్ళు ఎక్కువ సేపు మేలుకొని,ఉదయం చాలా లేటుగా లేస్తూ ఉంటారా. మరి కొంతమంది రాత్రి పూట తొందరగా పడుకొని,ఉదయం కూడా లేటుగా లేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎంత ఎక్కువసేపు నిద్రపోతే, అంత ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే.. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఎన్నో అనర్థాలకు దారి తీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అతినిద్ర వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చదివి తీసుకుందాం.. sleeping;kanna lakshminarayana;heart;sugar;shaktiఅతినిద్ర, నిద్రలేమి కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసా...!అతినిద్ర, నిద్రలేమి కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసా...!sleeping;kanna lakshminarayana;heart;sugar;shaktiSun, 21 Feb 2021 11:30:00 GMTసాధారణంగా మనలో చాలా మంది రాత్రిళ్ళు ఎక్కువ సేపు మేలుకొని,ఉదయం చాలా లేటుగా లేస్తూ ఉంటారా. మరి కొంతమంది రాత్రి పూట తొందరగా పడుకొని,ఉదయం కూడా లేటుగా లేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎంత ఎక్కువసేపు నిద్రపోతే, అంత ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటారు.  కానీ అది అపోహ మాత్రమే.. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఎన్నో అనర్థాలకు దారి తీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అతినిద్ర వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చదివి తీసుకుందాం..

ఎవరైనా సరే  రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర పోతే సరిపోతుంది. అంతేకాకుండా సమయం కుదిరినప్పుడల్లా రోజులో మధ్యాహ్నం ఒక అరగంట పాటు నిద్ర పోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  కాబట్టి బద్ధకంతో ఎక్కువసేపు నిద్రపోవడం, లేదా ఏదో ఒక కారణం చేత నిద్రపోలేక లేకపోవడం వంటివి చేయకూడదు. మానసిక ప్రశాంతత కోసం  నచ్చిన వారితో సమయం గడపడం,  లేదా పచ్చని వాతావరణంలో తిరగడం వ్యాయామాలు, యోగాసనాలు వంటివి చైస్తూ ఆరోగ్యంగా ఉండాలి.


చాలామంది నిద్రలేమి, అతినిద్ర కారణంగా బాధపడుతున్నారని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది .నిద్రలేమి కన్నా అతి నిద్ర ఇంకా ఎక్కువ ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా నిద్ర పోయే వారు డిప్రెషన్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంది. మెదడులోని కణాలు బలహీనం అయిపోతాయి. ఆలోచనా శక్తి క్రమంగా క్షీణిస్తుంది.  గర్భధారణ సమయంలోని ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండె ధమనులు దెబ్బతింటాయి. అంతేకాదు డయాబెటిస్ సమస్యతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా అవకాశాలు ఎక్కువ.  అంతేకాదు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఎన్నో అనర్ధాలు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోజుకు ఎంత సేపు నిద్ర పోవాలి అనే విషయం మీద ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి.. అయితే ఎంత సేపు నిద్ర పోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఎక్కువ నిద్ర పోవడం లేదా నిద్రలేమి అనేది వారి శారీరక,మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సగటు ఆరోగ్యవంతమైన మనిషికి 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది.  అనారోగ్యాల బారిన పడినప్పుడు, దీర్ఘకాలిక రోగాలు వేధిస్తున్నప్పుడు, ఒక గంట ఎక్కువ నిద్ర పోతే సరిపోతుంది. ఒకవేళ నిద్ర వేళలు పెరిగినా, తగ్గినా కూడా సమస్యలు ఏర్పడతాయి. నిద్రలేమి వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయి. నిద్రలేమి వల్ల మానసిక ఒత్తిడి, తలనొప్పి, సారిగా ఆలోచన చేయకపోవడం, మెదడు పనితీరు తగ్గిపోవడం, డిప్రెషన్కు గురి అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి.




సైడ్.. సైడ్ ప్లీజ్..కాస్తా సైడివ్వండయ్యా అంటున్నబన్ని.. ఇంతకీ విషయమేమిటంటే!

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>