Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/russia-found-that-bird-flu-may-contaminte-to-humans-too968885ba-0caa-473a-b545-5405ecd655a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/russia-found-that-bird-flu-may-contaminte-to-humans-too968885ba-0caa-473a-b545-5405ecd655a1-415x250-IndiaHerald.jpgఏడాది పాటు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, కోట్ల మంది ప్రాణాలను పోగొట్టుకుని, ఎట్టకేలకు వ్యాక్సిన్ ద్వారా దానిని ఎదుర్కొంటున్నాం. కానీ కరోనాను ఓడించామన్న కనీస ఆనందం కూడా లేకుండా మరికొన్ని వైరస్‌లు ప్రపంచంలోని అనేక దేశాలను అతలాకుతలం చేయడం ప్రారంభించాయి. ఇటీవల మన దేశంలో కూడా బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల్లో విపరీతంగా వ్యాప్తి చెందింది. వేల సంఖ్యలో కోళ్లు, కాకులు, ఇతర పక్షులు మృత్యువాత పడ్డాయి. అయితే ఆ వైరస్ మనుషులకు సోకే అవకాశం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు రష్యా శాస్త్రవేత్తలbird flu;manu;russia;2020మనుషులకూ బర్డ్‌ఫ్లూ వైరస్.. బయటపడ్డ షాకింగ్ విషయంమనుషులకూ బర్డ్‌ఫ్లూ వైరస్.. బయటపడ్డ షాకింగ్ విషయంbird flu;manu;russia;2020Sun, 21 Feb 2021 22:16:46 GMTఇంటర్నెట్ డెస్క్: ఏడాది పాటు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, కోట్ల మంది ప్రాణాలను పోగొట్టుకుని, ఎట్టకేలకు వ్యాక్సిన్ ద్వారా దానిని ఎదుర్కొంటున్నాం. కానీ కరోనాను ఓడించామన్న కనీస ఆనందం కూడా లేకుండా మరికొన్ని వైరస్‌లు ప్రపంచంలోని అనేక దేశాలను అతలాకుతలం చేయడం ప్రారంభించాయి. ఇటీవల మన దేశంలో కూడా బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల్లో విపరీతంగా వ్యాప్తి చెందింది. వేల సంఖ్యలో కోళ్లు, కాకులు, ఇతర పక్షులు మృత్యువాత పడ్డాయి. అయితే ఆ వైరస్ మనుషులకు సోకే అవకాశం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు రష్యా శాస్త్రవేత్తలు ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు.

‘హెచ్‌5ఎన్‌8’రకం బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనుషులకు సోకుతుందని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ రష్యాలోని ఒక పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే ఏడుగురికి ఈ స్ట్రెయిన్‌ సోకినట్లు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెక్టర్‌ లేబొరేటరీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ ఏడుగురిలో ‘హెచ్‌5ఎన్‌8’ జన్యుపదార్థం జాడ ఉన్నట్లు తేలిందని తెలిపింది. తేలికపాటి బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ సోకడంతో వారిలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, స్వల్ప చికిత్సతో త్వరగానే కోలుకున్నారని తెలిపింది. అయితే కొంత ఆనందించ గల విషయం ఏంటంటే.. మనుషుల నుంచి మనుషులకు ‘హెచ్‌5ఎన్‌8’ సోకడం లేదని అక్కడి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

 ‘మనుషుల్లో హెచ్‌5ఎన్‌8 బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ గుర్తింపు ప్రమాద హెచ్చరిక. భవిష్యత్తులో ఆ వైరస్‌ స్ట్రెయిన్‌ మరిన్ని జన్యుమార్పులకు గురై ప్రబలితే ఎలా స్పందించాలో నిర్ణయించుకునేందుకు ప్రపంచానికి తగిన సమయం దొరికింది. ఈ ఇన్ఫెక్షన్‌ నిర్ధారణకు పరీక్షలు, నివారణకు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టే వీలు కలిగింది’ అని రష్యా ప్రజారోగ్య విభాగం చీఫ్‌ అన్నారు.

ఇదిలా ఉంటే 2020 డిసెంబరులో అదే పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకిందని, అప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ వైరస్ ప్రభావం నుంచి బయటపడడం జరిగింది. ఈ విషయాన్ని కూడా రష్యా ఆరోగ్యశాఖ గుర్తు చేసింది. ఈ వివరాలన్నీ డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు తెలిపింది.


షణ్ముఖ్.. దీప్తి.. స్టార్ మా 100% లవ్..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>