Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comedians4f5d4e27-7fc6-4509-ac16-4e7a83ee48c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comedians4f5d4e27-7fc6-4509-ac16-4e7a83ee48c0-415x250-IndiaHerald.jpgమన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎందరో నటీనటులు, దర్శక నిర్మాతలు, గాయనీగాయకులు ఇతర టెక్నీషియన్లు తమ విభిన్న ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమని ప్రపంచ ఖ్యాతి పొందేలా చేశారు. ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్ నీ నిర్మించి బ్లాక్ బాస్టర్ హిట్లుతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపే ఉంది. భారత ప్రభుత్వం అందించే చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ, హాలీవుడ్ రేంజ్ లో ఏ మూవీ కూడా నిలవలేదు. అయితే కొందరు నటీనటులు తమ విభిన్నమైన ప్రతిభతో ఏకంగcomedians;chiranjeevi;susheela;srinivas;varsha;vijaya nirmala;india;tollywood;industries;cinema;telugu;hollywood;producer;film industry;producer1;padma shriతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రపంచ ఖ్యాతి పొందిన నటీనటులు ఎవరో మీకు తెలుసా..!!తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రపంచ ఖ్యాతి పొందిన నటీనటులు ఎవరో మీకు తెలుసా..!!comedians;chiranjeevi;susheela;srinivas;varsha;vijaya nirmala;india;tollywood;industries;cinema;telugu;hollywood;producer;film industry;producer1;padma shriSun, 21 Feb 2021 02:00:00 GMTపరిశ్రమ లో ఎందరో నటీనటులు, దర్శక నిర్మాతలు, గాయనీగాయకులు ఇతర టెక్నీషియన్లు తమ విభిన్న ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమని ప్రపంచ ఖ్యాతి పొందేలా చేశారు. ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్ నీ నిర్మించి బ్లాక్ బాస్టర్ హిట్లుతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపే ఉంది. భారత ప్రభుత్వం అందించే చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ, హాలీవుడ్ రేంజ్ లో ఏ మూవీ కూడా నిలవలేదు. అయితే కొందరు నటీనటులు తమ విభిన్నమైన ప్రతిభతో ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. అలాంటి టాలీవుడ్ తారల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మానందం : తెలుగు చిత్ర పరిశ్రమలో  తన హాస్యంతో గత మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు. ఈ పేరు చెబితే చాలు ముఖాల్లో చిరునవ్వు వెల్లి విరుస్తుంది. బ్రహ్మానందం సుమారు వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. ఇతన్ని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం : స్వర్గీయ గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రమణ్యం తన మధురమైన గానంతో దాదాపు నలభై వేల పాటలు పాడి తనకు తానే సాటి అన్న విధంగా 2001లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

సుశీల :  భాష ఏదయినా స్పష్టమైన ఉచ్ఛారణకి పెట్టింది పేరు. సుశీల గారిని గాన కోకిల ,గాన సరస్వతి అని పిలుస్తారు. సోలో సింగర్ గా 18 వేల పాటలు పాడి గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు.

గజల్ శ్రీనివాస్: గజల్‌ గీతాలతో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు పొందాడు.125 భాషల్లో గజల్స్ పాడిన సింగర్ గా రికార్డు సృష్టించి 2008 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

విజయ నిర్మల:  తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో ఇంచు మించు 42 సినిమాలు డైరెక్ట్ చేసిన మ‌హిళ‌గా విజ‌య‌నిర్మ‌ల గారు 2000 వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

డి.రామానాయుడు: ఇతను తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత. స్వర్గీయ డి.రామానాయుడు గారు వివిధ భాషలలో 150కి పైగా చిత్రాలను నిర్మించి తన సత్తా చాటుకున్నాడు. ఇతను అత్యధిక సినిమాలను నిర్మించి 2008లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు నటీనటులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను పొందడం గర్వించదగ్గ విషయమే కదా.


చక్కెర ఎక్కువగా తింటున్నారా... అయితే జాగ్రత్త!

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>