PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpgతొలిద‌శ‌లో మావోళ్ల‌ను నామినేష‌న్ కూడా వేయ‌నీయ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పారు. అంద‌రూ స‌రే అనుకున్నారు. ఇక‌, రెండో ద‌శ‌కు వ‌చ్చే స‌రికి జ‌న‌సేన ప‌రిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా మారింది. కొన్ని జిల్లాల్లో జ‌నసేన మ‌ద్ద‌తు దారులు 20 వ‌ర‌కు సీట్లు సంపా యించుకున్నారు. ఇక‌, బీజేపీ ప‌రిస్థితి దారుణంగా మారింది. రెండో దశ‌లోనూ బోణీ కొట్ట‌లేదు. ఇక‌, మూడో ద‌శలోస త్తా చాటుతామ‌న్నారు. ఈ క్ర‌మంలో నాలుగు చోట్ల బీజేపీ మ‌ద్ద‌తు దారులు గెలుపు గుర్రం ఎక్కిన‌ట్టు ప్ర‌క‌టించినా.. వెంట‌నే ఇద్ద‌రు వైసీపీ పంచ‌న bjp janasena;bharatiya janata party;janasena;media;letter;tdp;ycp;janasena party;partyనాలుగో విడ‌త‌లోనూ అడ్ర‌స్ లేని పొత్తు పార్టీలు!!నాలుగో విడ‌త‌లోనూ అడ్ర‌స్ లేని పొత్తు పార్టీలు!!bjp janasena;bharatiya janata party;janasena;media;letter;tdp;ycp;janasena party;partySun, 21 Feb 2021 21:20:04 GMTరాష్ట్రంలో నాలుగో ద‌శ పంచాయ‌తీ పోలింగ్ పూర్త‌యి.. ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ఇక‌, ఇది ఆఖ‌రు ద‌శ‌. మ‌ళ్లీ ఐదేళ్ల వ‌ర‌కు పంచాయ ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌వు. అలాంటి ఎన్నిక‌ల్లో వైసీపీ, టీడీపీలు పోటీ ప‌డి మరీ ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. సంబ‌రాలు కూడా చేసు కుంటున్నాయి. ఇక‌, ఎవ‌రి ఫ‌లితాన్ని వారు ఇచ్చుకుంటున్నారు. పార్టీ జెండాలు, అజెండాలు, గుర్తుల‌తో సంబంధం లేకుండా నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌లు కావ‌డంతో ఎవ‌రికివారే అన్న‌ట్టుగా ఫ‌లితాలు చెప్పుకొంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో తొలిద‌శ‌లో బీజేపీ-జ‌న‌సేన ద్వ‌యం చేతులు ఎత్తేసింది.

ఈ నేప‌థ్యంలో మీడియా మీటింగ్ ఏర్పాటు చేసిన ఇరు పార్టీల నాయ‌కులు త‌దుప‌రి ద‌శ‌ల‌పై ఆశ‌లు ప్ర‌క‌టించారు. తొలిద‌శ‌లో మావోళ్ల‌ను నామినేష‌న్ కూడా వేయ‌నీయ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పారు. అంద‌రూ స‌రే అనుకున్నారు. ఇక‌, రెండో ద‌శ‌కు వ‌చ్చే స‌రికి జ‌న‌సేన ప‌రిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా మారింది. కొన్ని జిల్లాల్లో జ‌నసేన మ‌ద్ద‌తు దారులు 20 వ‌ర‌కు సీట్లు సంపా యించుకున్నారు. ఇక‌, బీజేపీ ప‌రిస్థితి దారుణంగా మారింది. రెండో దశ‌లోనూ బోణీ కొట్ట‌లేదు. ఇక‌, మూడో ద‌శలోస త్తా చాటుతామ‌న్నారు. ఈ క్ర‌మంలో నాలుగు చోట్ల బీజేపీ మ‌ద్ద‌తు దారులు గెలుపు గుర్రం ఎక్కిన‌ట్టు ప్ర‌క‌టించినా.. వెంట‌నే ఇద్ద‌రు వైసీపీ పంచ‌న చేరిపోయారు.

ఇక‌, నాలుగో ద‌శ‌పై జ‌న‌సేన‌-బీజేపీల ద్వ‌యం ఆశ‌లు పెట్టుకుంది. ఆఖ‌రి ద‌శ‌లో 83 శాతం పోలింగ్ జ‌రిగింది. దాదాపు అంద‌రూ కూడా ఓట్లు వేశార‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో జ‌నసేన‌-బీజేపీ మ‌ద్ద‌తు దారులు భారీ సంఖ్య‌లో గెలుస్తార‌ని.. జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించుకున్నారు. అయితే.. తాజాగా వ‌స్తున్న ఫ‌లితాల స‌ర‌ళి చూస్తే.. మాత్రం భిన్నంగా ఉంది. రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు వ‌చ్చిన ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. టీడీపీ 222, వైసీపీ 248, జనసేన 2, బీజేపీ 1, ఇతరులు 21 స్థానాల్లో విజయం సాధించారు. అంటే.. బీజేపీ పూర్తిగా చ‌తికిల ప‌డింద‌నే చెప్పాలి. ఇక‌, జ‌న‌సేన‌లో ఆశ‌లు ఉన్నా.. ఆ ఆశ‌ల మేర‌కు ఫ‌లితం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ పొత్తు పార్టీలు ఇక మీద‌ట ఏంచేస్తాయో చూడాలి. 


నాలుగో విడ‌త ఇంత ఉత్కంఠా... వైసీపీ 248 - టీడీపీ 222

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>