PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nellore-district-municipal-elections66a52f6d-7efa-45c7-9019-0b5003daddf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nellore-district-municipal-elections66a52f6d-7efa-45c7-9019-0b5003daddf9-415x250-IndiaHerald.jpgపాలకవర్గం ఏర్పాటై, ప్రజా ప్రతినిధులు ఉంటేనే.. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేక అధికారులు ఉన్నా కూడా అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగదని ప్రజలకు బలమైన నమ్మకం. తాజాగా.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలకు రెండోసారి తెరలేచినా, నెల్లూరు కార్పొరేషన్ కి మాత్రం మోక్షం లభించలేదు. అయితే దీనికి కారణం వైసీపీయేనని అంటున్నాయి ప్రతిపక్షాలు. అధికార పక్షం కారణంగానే.. వార్డుల పునర్విభజనలో అవకతవకలు జరిగాయని, అందువల్లే టీడీపీ నేతలు కోర్టుకెక్కారని, ఫలితంగా ఎన్నిక వాయిదా పడిందని చెబుతున్నారు. nellore municipal elections;high court;nellore;court;december;tdp;ycp;marchపురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?పురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?nellore municipal elections;high court;nellore;court;december;tdp;ycp;marchSun, 21 Feb 2021 09:00:00 GMTటీడీపీ నేతలు కోర్టుకెక్కారని, ఫలితంగా ఎన్నిక వాయిదా పడిందని చెబుతున్నారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికలకు గతేడాది మార్చి 11వ తేదీన ప్రకటన విడుదలైంది. ఆ జాబితాలో నెల్లూరు నగరపాలక సంస్థకు చోటు లేదు. అప్పటికే నెల్లూరు కార్పొరేషన్ కి సంబంధించి కేసులు కోర్టులో ఉండటంతో.. ఎన్నిక సాధ్యపడలేదు.

నెల్లూరు కార్పొరేషన్‌లో విలీన ప్రాంతమైన పొట్టేపాళేన్ని తిరిగి పంచాయతీగా మార్చాలంటూ 2019లో హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆ ప్రాంతాన్ని కార్పొరేషన్‌ నుంచి తొలగించారు. తర్వాత డివిజన్ల పునర్విభజన చేపట్టారు. కానీ ఈ పునర్విభజన ప్రక్రియ సక్రమంగా జరగడంలేదని, అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్నారని, అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. చివరకు పునర్విభజన తర్వాత పరిస్థితి అందరికీ అర్థమైంది. అత్యథికంగా ఒక డివిజన్లో 16వేట్లు ఉండగా.. మరో డివిజన్లో అత్యల్పంగా 5వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే పారదర్శకంగా వార్డుల విభజన జరగలేదనే విషయం అర్థమైంది. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.

ఈ అవకతవకలపై టీడీపీ మాజీ కార్పొరేటర్‌ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని,  ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆయన పిటిషన్‌లో కోరారు. చివరకు డివిజన్ల పునర్విభజనను మళ్లీ చేపట్టాల్సిందిగా కార్పొరేషన్‌ అధికారులను ఆదేశిస్తూ గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత వారానికే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నెల్లూరు కార్పొరేషన్ పేరు అందులో లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే.. ఎన్నికలు వాయిదా పడి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ డివిజన్ల పునర్విభజన సక్రమంగా జరగలేదని అంటున్నారు. గతేడాది డిసెంబర్ లో అభ్యంతరాలకోసం డివిజన్ల లిస్ట్ ప్రకటించినా.. ప్రతిపక్షాలు మరోసారి అభ్యంతరాలు లేవనెత్తాయి. పాత లిస్ట్ నే మళ్లీ ప్రకటించాయని ఆరోపిస్తున్నాయి. దీంతోపాటు.. ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో నెల్లూరుకి ఎన్నికలు జరగడంలేదు. వార్డుల పునర్విభజన పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడం వల్లే నెల్లూరు ఎన్నికలు ఆగిపోయాయని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. 


కేశినేనిపై చంద్రాగ్ర‌హం... బాబు డెసిష‌న్ తీసేసుకున్నారా ?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>