SportsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/arjun-tendulkar2f6deebf-fb6a-4de1-bd07-7420d0b25328-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/arjun-tendulkar2f6deebf-fb6a-4de1-bd07-7420d0b25328-415x250-IndiaHerald.jpgసచిన్ ప్రాభవంతోనే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఆయ‌న త‌న‌యుడు అర్జున్ టెండుల్క‌ర్‌ను క‌నీస ధ‌ర రూ.20ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింద‌ని కొంత‌మంది నెటిజ‌న్లు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో మ‌రికొంత‌మంది ప్ర‌ముఖులు మాత్రం ఈ విమ‌ర్శ‌లు అర్థ ర‌హితం అంటూ కొట్టిపారేస్తున్నారు. అదే స‌మ‌యంలో అర్జున్‌కు బాస‌ట‌గా నిలుస్తున్నారు. అర్జున్ ఉత్సాహాన్ని నీరు గార్చ‌కండి అంటూ ఘాటైన స‌మాధానాలిస్తున్నారు. యువ క్రికెటర్‌ అర్జున్ తెందూల్కర్‌పై అర్థం లేని విమ‌ర్శ‌లు వ్యాఖ్యలు రావడం బాధాకరమని బాలీవుడ్‌ నటుడు, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ అarjun-tendulkar;arjun tendulkar;sachin;ali;mumbai;cricket;producer;producer1;yuva;arjun 1;paruguఅర్జున్ తెందుల్క‌ర్‌ అద్భుత ఆట‌గాడు...ట్రోలింగ్ చేస్తున్న వారికి ప‌ర్హాన్ అక్త‌ర్ కౌంట‌ర్‌అర్జున్ తెందుల్క‌ర్‌ అద్భుత ఆట‌గాడు...ట్రోలింగ్ చేస్తున్న వారికి ప‌ర్హాన్ అక్త‌ర్ కౌంట‌ర్‌arjun-tendulkar;arjun tendulkar;sachin;ali;mumbai;cricket;producer;producer1;yuva;arjun 1;paruguSun, 21 Feb 2021 07:33:56 GMTసచిన్ ప్రాభవంతోనే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఆయ‌న త‌న‌యుడు అర్జున్ టెండుల్క‌ర్‌ను క‌నీస ధ‌ర రూ.20ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింద‌ని కొంత‌మంది నెటిజ‌న్లు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో మ‌రికొంత‌మంది ప్ర‌ముఖులు మాత్రం ఈ విమ‌ర్శ‌లు అర్థ ర‌హితం అంటూ కొట్టిపారేస్తున్నారు. అదే స‌మ‌యంలో అర్జున్‌కు బాస‌ట‌గా నిలుస్తున్నారు. అర్జున్ ఉత్సాహాన్ని నీరు గార్చ‌కండి అంటూ ఘాటైన స‌మాధానాలిస్తున్నారు. యువ క్రికెటర్‌ అర్జున్ తెందూల్కర్‌పై  అర్థం లేని విమ‌ర్శ‌లు వ్యాఖ్యలు రావడం బాధాకరమని బాలీవుడ్‌ నటుడు, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ అన్నాడు.  ‘కెరీర్‌ మొదలు పెట్టకముందే అనుచిత వ్యాఖ్యలతో అర్జున్‌లోని ఉత్సాహాన్ని చంపేయొద్దు. మేమిద్దరం తరచూ ఒకే జిమ్‌లో కసరత్తులు చేస్తుంటాం.


దేహదారుఢ్యం కోసం శ్రమించే తీరు, మెరుగైన క్రికెటర్‌ అవ్వాలన్న దృష్టి అతడిలో కనిపిస్తుంది. అతడిపై ఆశ్రిత పక్షపాతం అనే వ్యాఖ్యలు చేయడం బాధాకరం, కూర్రం’ అని సామాజిక మాధ్య‌మం ద్వారా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు.  ‘‘అర్జున్‌ టెండుల్కర్‌ గురించి ఒక విషయం చెప్పదలచుకున్నాను. మేమిద్దరం ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. ఫిట్‌నెస్‌ సాధించేందుకు అతడు ఎంతో కఠినంగా శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. కానీ వాటన్నింటినీ నెపోటిజం అనే ఒకే ఒక్క మాటతో నీరుగార్చడం సరికాదంటూ పేర్కొన్నారు. 2008 నుంచి 2013 వరకు సచిన్‌ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.


ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌, లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అర్జున్‌ టెండూల్కర్‌ పేరు వేలంలో రాగానే ముంబై ఇండియన్స్‌ వెంటనే కనీస ధరకు ఇతడిని కొనుగోలు చేసింది. మరే జట్టు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అర్జున్‌ ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ-20 ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్.. జింఖానా జట్టుపై కేవలం 31 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. మరీ ముఖ్యంగా.. ఆఫ్ స్పిన్నర్ హషీర్ దఫేదార్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6 బాదేశాడు. మొత్తంగా అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండగా.. బౌలింగ్‌లోనూ 41 పరుగులిచ్చి మూడు వికెట్లని అర్జున్ టెండూల్కర్ పడగొట్టాడు.  అర్జున్ ప్ర‌తిభ‌కు ఈ ప్ర‌ద‌ర్శ‌న నిద‌ర్శ‌న‌మ‌ని ఈ క్రీడాకారుడిని స‌పోర్ట్ చేసే వాళ్లు వాదిస్తున్నారు. చూడాలి మ‌రీ త‌న ఆట తీరుతో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయిస్తారా లేదా అన్న‌ది.










విజృంభించిన వైరస్.. 250 కుక్కలు మృతి..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>