WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancyb6e088ff-d7c7-434f-8b60-630174297c84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancyb6e088ff-d7c7-434f-8b60-630174297c84-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు సరిగ్గా నిద్రపోలేక నానా అవస్థలు పడుతుంటారు. అయితే గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటాడు. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా నిద్ర లేస్తారు. మళ్లీ పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర పట్టదు. సహజంగా గర్భిణులు మానసిక ఒత్తిడికి లోనవుతారు.pregnancy;chiranjeevi;tara;tiru;aqua;coffeeఅమ్మ: గర్భధారణ సయమంలో సరిగ్గా నిద్ర సరిపోవట్లేదా.. ఇలా చేయండి..!?అమ్మ: గర్భధారణ సయమంలో సరిగ్గా నిద్ర సరిపోవట్లేదా.. ఇలా చేయండి..!?pregnancy;chiranjeevi;tara;tiru;aqua;coffeeSun, 21 Feb 2021 15:00:00 GMT
గర్భవతిగా ఉన్నప్పుడు వారి కాళ్లు తిమ్మిరెక్కడం సహజం. కొందరి కాళ్లు వాపుగా కనిపిస్తాయి. ఇలా కాలు తిమ్మిరెక్కినప్పుడు కూడా నిద్రకు భంగం వాటిల్లుతుంది. తరచూ మూత్ర విసర్జన సమస్య కూడా ఉంటుంది. చివరి దశలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటాయి.మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టీ, కాఫీ లాంటివి తాగేస్తుంటారు. వీలైనంత వరకు వాటిని దూరం పెట్టాలి. ఆహారపు అలవాట్లు కూడా ఓ సమస్యే. అందుకే ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి.

గర్భిణులు సరిగ్గా నిద్ర పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు పడుకునే ముందు వేడి పాలను తాగండి. ఆరోగ్యంతోపాటు నిద్రకు మేలు చేస్తుంది. పిండి పదార్థాలను ఎక్కువగా తినండి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి. పగటి పూట ఆరోగ్యకరమైన చిరుతిండి.. రాత్రి పూట పండ్లు, లైట్ ఫుడ్ తీసుకోండి. వీలైనంత వరకు ఆహారాన్ని ద్రవరూపంలోనే తీసుకోండి. గర్భ సమయంలో పిల్లలకు నీరు ఎంతో అవసరం. బిడ్డకు కావాల్సిన ఎనర్జీ కూడా ద్రవ రూపంలోనే చేరుతుంది.

అంతేకాదు.. ఒత్తిని తగ్గించుకునేందుకు తేలికపాటి యోగాసనాలు చేయండి. అప్పుడు మానసిక ఒత్తిడి నుంచి దూరమవుతారు. అలాగే పడుకోవడానికి ప్రత్యేక షెడ్యూల్ పాటించండి. టైం కేటాయించుకుని పడుకోవడం అలవాటు చేసుకోండి. కాళ్లు తిమ్మిరెక్కినప్పుడు తాపన ప్యాడ్ లేదా వేడి నీటి సంచిని నొప్పి ఉన్న ప్రదేశాల్లో ఉంచండి. రోజూ వెచ్చని స్నానం చేయండి. ప్రశాంతంగా ఉంటూ.. మీకు నచ్చిన పని చేయండి. అప్పుడు మీకు హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.


నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>