PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shabnam8478410f-a44c-40f8-a255-3a3b32d3c4a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shabnam8478410f-a44c-40f8-a255-3a3b32d3c4a0-415x250-IndiaHerald.jpgదేశంలో …మొట్టమొదటి సారిగా ఒక మహిళ ఉరికంబం ఎక్కబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ను మథురైలోని జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. షబ్నమ్ ఇంగ్లిష్‌లో ఎంఏ చేసింది. ఐదో తరగతి కూడా పాస్ కాని సలీంను ప్రేమించి పెళ్లాడాలనుకుంది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపింది. ఈ కేసులో షబ్నమ్ కు, ఆమె ప్రియుడికి కోర్టు ఉరి శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమెకు ఉరి శిక్ష అమshabnam;women;amala akkineni;ram pothineni;seema;mathura;uttar pradesh;woman;murder.;taj mahal;uri;nirbayaడియర్‌, ప్రెసిడెంట్ అంకుల్ నా తల్లిని ఉరి తీయ్యొద్దు... రామ్‌నాథ్ కోవింద్‌కు అభ్య‌ర్థ‌న‌డియర్‌, ప్రెసిడెంట్ అంకుల్ నా తల్లిని ఉరి తీయ్యొద్దు... రామ్‌నాథ్ కోవింద్‌కు అభ్య‌ర్థ‌న‌shabnam;women;amala akkineni;ram pothineni;seema;mathura;uttar pradesh;woman;murder.;taj mahal;uri;nirbayaSun, 21 Feb 2021 11:18:34 GMT మహిళ ఉరికంబం ఎక్కబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ను మథురైలోని జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. షబ్నమ్ ఇంగ్లిష్‌లో ఎంఏ చేసింది. ఐదో తరగతి కూడా పాస్ కాని సలీంను ప్రేమించి పెళ్లాడాలనుకుంది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపింది.  ఈ కేసులో షబ్నమ్ కు, ఆమె ప్రియుడికి కోర్టు ఉరి శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమెకు ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె 12 ఏళ్ల కుమారుడు మహ్మద్ తాజ్ తన తల్లి మరణశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు.


 మహ్మద్‌ తాజ్ రామ్‌పుర్‌ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు.  షబ్నమ్‌ జైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది. జైల్ రూల్స్ ప్రకారం ఆరేళ్ల తర్వాత పిల్లాడు కారాగారం పరిసరాల్లో ఉండకూడదు. దీంతో ఆమె స్నేహితుడు ఉస్మాన్‌ సైఫీకి తన కొడుకును అప్పగించింది షబ్నమ్. నిందితురాలు తన కన్నవాళ్లతో సహా అందరిని హత్య చేస్తే.. కడుపున పుట్టిన బిడ్డ మాత్రం షబ్నమ్‌ని కాపాడుకోవడానికి పరితపిస్తున్నాడు. అయితే రాష్ట్రపతి నిర్ణయం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రెసిడెంట్‌ ఆఫీస్‌ నుంచి ఎలాంటి సమాచారం వెలువడబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ సందర్భంగా అతడు తీవ్ర ఆవేదను లోనైయ్యాడు. ఇప్పటికే గవర్నర్‌ అనందిబెన్‌ పటేల్‌ షబ్నమ్‌ కేసుకు సంబంధించిన క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించారు. దీంతో ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసిన పవన్‌ జల్లాదేనే షబ్నమ్‌నూ కూడా ఉరి తీసే అవకాశం ఉంది.


సుప్రీం న్యాయస్థానం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించడం వల్ల.. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నారు. అది కూడా తిరస్కరణకు గురవ్వడంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్‌ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీయనున్నారు. తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ ఉరి తీసే గదిని జల్లాద్‌ ఇప్పటికే రెండు సార్లు పరిశీలించారు. షబ్నమ్‌కు ముందు మహారాష్ట్రలోని అక్కాచెల్లెళ్లు సీమా గవిట్‌, రేణు షిండేలకు కూడా ఉరిశిక్ష పడింది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో వీరు నిందితులు. వీరి క్షమాభిక్షను 2014లో రాష్ట్రపతి తిరస్కరించారు. వీరికింకా ఉరిశిక్ష అమలు కాలేదు. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్నారు.












జియో బంపరాఫర్..వందకే నెలంతా ఫ్రీ డేటా, కాల్స్

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>