EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ghmc-mayor01d0f72e-ea8d-4f09-9be4-34d60158f43c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ghmc-mayor01d0f72e-ea8d-4f09-9be4-34d60158f43c-415x250-IndiaHerald.jpg ఉనికిని చాటేందుకు.. తన బ‌ల‌మేంటో ప్ర‌త్య‌ర్థుల‌కు చాటిచెప్పేందుకు..ఎవ‌రూ త‌న ద‌రిదాపుల్లో కూడా లేర‌ని నిరూప‌ణ చేసేందుకు టీఆర్ ఎస్ పార్టీ త‌న స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ద్వారా చెబుతోంది. రాష్ట్రంలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో దాదాపు 30ల‌క్ష‌ల స‌భ్య‌త్వాల‌ను ఆ పార్టీ న‌మోదు పూర్తి చేయ‌డం విశేషం. రాష్ట్రంలో మ‌రే పార్టీకి ఈ స్థాయిలో స‌భ్య‌త్వాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ్రామాల్లో జోరుగా పార్టీ స‌భ్య‌త్వాల‌ను నిర్వ‌హిస్తోంది. ఎమ్మెల్యేలకు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌గా స‌భ్య‌త్వ న‌మోదుకు ప్ర‌త్య‌కంగా క‌మిటీktr;ktr;hyderabad;telangana rashtra samithi trs;assembly;march;research and analysis wing;party;mantraహెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నంహెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నంktr;ktr;hyderabad;telangana rashtra samithi trs;assembly;march;research and analysis wing;party;mantraSun, 21 Feb 2021 09:16:56 GMTఉనికిని చాటేందుకు.. తన బ‌ల‌మేంటో ప్ర‌త్య‌ర్థుల‌కు చాటిచెప్పేందుకు..ఎవ‌రూ త‌న ద‌రిదాపుల్లో కూడా లేర‌ని నిరూప‌ణ చేసేందుకు టీఆర్ ఎస్ పార్టీ త‌న స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ద్వారా చెబుతోంది. రాష్ట్రంలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో దాదాపు 30ల‌క్ష‌ల స‌భ్య‌త్వాల‌ను ఆ పార్టీ న‌మోదు పూర్తి చేయ‌డం విశేషం. రాష్ట్రంలో మ‌రే పార్టీకి ఈ స్థాయిలో స‌భ్య‌త్వాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ్రామాల్లో  జోరుగా పార్టీ స‌భ్య‌త్వాల‌ను నిర్వ‌హిస్తోంది. ఎమ్మెల్యేలకు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌గా స‌భ్య‌త్వ న‌మోదుకు ప్ర‌త్య‌కంగా క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేశారు. నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల‌, గ్రామ స్థాయిల్లో ఈ క‌మిటీలు స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్రామాన్ని నిర్వ‌హిస్తున్నాయి. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊరూరా సంబురంగా సాగుతున్నది.


పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటుండగా ప్రజలు సైతం సభ్యత్వా లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్క డ చూసినా సభ్యత్వాల సందడి కన్పిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి 50వేల స‌భ్య‌త్వాల న‌మోదుకు నేత‌ల‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల‌క్ష్యాలు విధించారు. పార్టీ స‌భ్య‌త్వాల‌పై కేటీఆర్ టార్గెట్లు విధించ‌డంతో ఎమ్మెల్యేలు పోటీ ప‌డి ప‌నిచేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టిలో ప‌డేందుకు ఇదే మంచి అవ‌కాశంగా వారు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నా.. పదిహేను ఇరవై రోజుల్లోనే టార్గెట్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు అమాత్యులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే రంగంలోకి దిగారు.



ఇదిలా ఉండ‌గా  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్ తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. టార్గెట్ను రీచ్ కావ‌డంతో నేత‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా కేటీఆర్ కొంత‌మంది నేత‌ల‌పై కూడా ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు స‌మాచారం.  గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌‌చార్జులతో ఎప్ప‌టిక‌ప్పుడు వాక‌బు చేస్తున్నారు. సికింద్రాబాద్‌‌, అంబర్‌‌పేట నియోజకవర్గాల్లో 15 వేల సభ్యత్వాలే కాగా, ముషీరాబాద్‌‌లో 20 వేల సభ్యత్వాలు, సనత్‌‌నగర్‌‌లో 25 వేల సభ్యత్వాలు అయినట్టు పార్టీ ఇన్‌‌చార్జులు కేటీఆర్‌‌కు వివరించారు.






బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>