Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/sports/libra_libra/ipl-2021-auction17d29646-1bea-4918-80df-a87358cbc100-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/sports/libra_libra/ipl-2021-auction17d29646-1bea-4918-80df-a87358cbc100-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతేడాది క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ను వాయిదా వేయకుండా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇక ఈ ఏడాది కూడా అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించే విధంగా బిసిసిఐ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇక ఐపీఎల్ లో ఉండే ఆయా జట్లు కొంత మంది ఆటగాళ్లను వేలం లోకి వదిలేయగా.. ఇటీవలే మినీ వేలం నిర్వహించింది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఆయా జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లనుipl;rani;mini;rajasthan;australia;bcci;steve smith;chris morrisఐపీఎల్ 2021 : ఇక స్మిత్ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. ఎందుకంటే.?ఐపీఎల్ 2021 : ఇక స్మిత్ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. ఎందుకంటే.?ipl;rani;mini;rajasthan;australia;bcci;steve smith;chris morrisSun, 21 Feb 2021 12:00:00 GMTబీసీసీఐ  ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతేడాది క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ను వాయిదా వేయకుండా బీసీసీఐ  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇక ఈ ఏడాది కూడా అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించే విధంగా బిసిసిఐ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటికే ఇక ఐపీఎల్ లో ఉండే ఆయా  జట్లు  కొంత మంది ఆటగాళ్లను వేలం లోకి వదిలేయగా.. ఇటీవలే మినీ వేలం నిర్వహించింది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఆయా జట్లు  తమకు కావాల్సిన ఆటగాళ్లను వేలం లో కొనుగోలు చేశాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవలే బిసిసిఐ నిర్వహించిన మినీ వేలంలో  కొంత మంది ఆటగాళ్లకు ఊహించని విధంగా దొర పలికితే.. ఇక ఎంతో క్రేజ్ వున్న ఆటగాళ్లకు మాత్రం అతి తక్కువ ధర పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా క్రిస్ మోరిస్ ఐపీఎల్ అతి ఎక్కువ ధర పలికిన ఆటగాడి గా రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియన్ ఆటగాడు మాక్స్ వెల్ రికార్డు స్థాయిలో ధర పలికితే గత ఏడాది బాగా రాణించిన స్మిత్ మాత్రం అతి తక్కువ ధర పలకడం గమనార్హం.  స్టార్ ఆటగాడు అయినప్పటికీ ఎక్కువ మొత్తంలో చెల్లించి స్మిత్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.



 రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 2.2 కోట్లకు మాత్రమే స్టీవ్ స్మిత్ ను కొనుగోలు చేసింది. అయితే తాజాగా దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఏడాది స్టీవ్ స్మిత్ ఐపీఎల్ ఆడకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు మైకేల్ క్లార్క్. గతంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరించిన  స్మిత్ 12.5 కోట్లు తీసుకున్నాడని కానీ ప్రస్తుతం ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టు 2.2 కోట్లకు  మాత్రమే కొనుగోలు చేసిందని.. అంత తక్కువ మొత్తం తీసుకుని స్మిత్ ఆడుతాడు అని మాత్రం తాను అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు మైకేల్ క్లార్క్. కాగా ప్రస్తుతం మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త చర్చకు దారితీశాయి.


ఆర్మీ ఆఫీసర్ ని కాపడబోయి చేయి పోగొట్టుకున్న జ్యోతిఆ ప్రమాదమే ఈమె జీవితాన్ని ఎలా మార్చేసింది.?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>