Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona542d64ef-662a-4639-93a4-a509db83b36e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona542d64ef-662a-4639-93a4-a509db83b36e-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ భారతదేశం లో ఎంత విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో వేల కేసుల నుంచి లక్షల కేసుల వరకు పాకిపోయింది. ఎంతోమంది ప్రాణాలను సైతం బలితీసుకుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ పేరేత్తితే చాలు జనాలు మొత్తం బెంబేలెత్తి పోయే పరిస్థితి కూడా ఏర్పడింది అనే విషయం తెలిసిందే. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగడంతో ప్రస్తుతం కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరcorona;huzur nagar;village;central government;karimnagar;coronavirus;panjaaఒక్కసారిగా వణికించిన కరోనా.. వామ్మో.. ఆ గ్రామంలో ఎన్ని కేసులో తెలుసా..?ఒక్కసారిగా వణికించిన కరోనా.. వామ్మో.. ఆ గ్రామంలో ఎన్ని కేసులో తెలుసా..?corona;huzur nagar;village;central government;karimnagar;coronavirus;panjaaSun, 21 Feb 2021 04:00:00 GMTకరోనా వైరస్ పేరేత్తితే  చాలు  జనాలు మొత్తం బెంబేలెత్తి పోయే పరిస్థితి కూడా ఏర్పడింది అనే విషయం తెలిసిందే.  కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగడంతో  ప్రస్తుతం కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య 15 వేలకు మించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి.  ఇక అంతే కాకుండా ప్రస్తుతం అన్ లాక్ మార్గదర్శకాల లో భాగంగా అన్ని రకాల కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి.  ఇక దీనితో పాటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమై శరవేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.  ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మొదట్లో కరోనా వైరస్ విషయంలో వణికి పోయిన జనాలలో  ప్రస్తుతం మాత్రం కరోనా అంటే భయం లేకుండా పోతుంది. కనీస జాగ్రత్తలు కూడా కనిపించడం లేదు.



 మాస్క్  ధరించకపోవడం భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తున్నారు.. తద్వారా కొన్ని చోట్ల మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఒక గ్రామాన్ని కరోనా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న చేగుర్థి అనే గ్రామంలో ఇటీవల కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో 33 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన దుర్గం కనకయ్య అనే వ్యక్తి పది రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందగా ఇక ఆయన అంత్యక్రియలకు గ్రామస్తులతో పాటు పక్క  గ్రామానికి చెందిన వారు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా  ఇక గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించగా ఏకంగా 33  కేసులు బయటపడడంతో గ్రామస్తులందరూ బేంబేలెత్తిపోతున్నారు.


తక్కువ ఈఎంఐతో మార్కెట్ లో సందడి చేస్తున్న కారు ఇదే.. ధర ఎంతంటే?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>