WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/jyothi-vikasd61ecc03-c3fc-409f-bcea-e0332523def1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/jyothi-vikasd61ecc03-c3fc-409f-bcea-e0332523def1-415x250-IndiaHerald.jpgఛత్తీస్‌గడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన 30 ఏళ్ల జ్యోతీ 2010వ సంవత్సరంలో బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలను కాపాడారు. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ అయిన ఆమె అప్పట్లో తన కాలేజీ హాస్టల్ నుంచి దంతేవాడ పట్టణానికి ఓ బస్సులో ప్రయాణించారు. jyothi vikas;jyothi;kerala;bharatiya janata party;korcha;bus;panchayati;marriage;army;jawaan;college;party;fidaaఆర్మీ ఆఫీసర్ ని కాపడబోయి చేయి పోగొట్టుకున్న జ్యోతిఆ ప్రమాదమే ఈమె జీవితాన్ని ఎలా మార్చేసింది.?ఆర్మీ ఆఫీసర్ ని కాపడబోయి చేయి పోగొట్టుకున్న జ్యోతిఆ ప్రమాదమే ఈమె జీవితాన్ని ఎలా మార్చేసింది.?jyothi vikas;jyothi;kerala;bharatiya janata party;korcha;bus;panchayati;marriage;army;jawaan;college;party;fidaaSun, 21 Feb 2021 12:05:00 GMTజవాన్ ప్రాణాలను కాపాడారు. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ అయిన ఆమె అప్పట్లో తన కాలేజీ హాస్టల్ నుంచి దంతేవాడ పట్టణానికి ఓ బస్సులో ప్రయాణించారు. అయితే ఆమె ముందు సీట్ లోనే కూర్చున్న వికాస్ అనే ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ కిటికీ కడ్డీలపై తలపెట్టుకొని నిద్రపోతున్నారు. ఆయన దంతెవాడ జిల్లాలోని బైలాదిల లో ఏర్పాటుచేసిన సైనిక శిబిరానికి వెళ్తున్నారు.

అయితే ఈ సమయంలోనే ఒక లారీ ట్రక్ వేగంగా వికాస్ కూర్చున్న సీటు వైపే నేరుగా దూసుకు రావడం ప్రారంభించింది. నిద్రపోతున్న జవాన్ ఈ విషయాన్ని గమనించలేకపోయారు. కానీ దూసుకొస్తున్న ఆ లారీని గమనించిన జ్యోతి వెంటనే తన కుడి చేత్తో వికాస్ ని సీటు నుంచి దూరంగా నెట్టివేశారు. దీంతో వికాస్ ఈ ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి స్వల్పమైన గాయాలతోనే తప్పించుకోగలిగారు. కానీ వికాస్ ని కాపాడిన జ్యోతి కుడిచేయి మాత్రం ఈ దుర్ఘటనలో నుజ్జునుజ్జు అయ్యింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆమెకు సర్జరీ చేశారు. కానీ కొద్దిరోజులకే ఆమె చేతికి ఇన్ఫెక్షన్ సోకింది. దీనితో ఆమె కుడి భుజం తీసి వేయాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. చివరికి ఆమె తప్పని పరిస్థితుల్లో తన కుడిచేతిని కోల్పోయారు.

అయితే తన ప్రాణాలను కాపాడిన జ్యోతి పై వికాస్ పై గౌరవమర్యాదలు పెరిగిపోయాయి. తన కారణంగానే ఆమె చేయి కోల్పోయారని ఆయన ఎంతో బాధ పడ్డారు. ఆమె గొప్ప మనస్తత్వానికి ఆయన ఫిదా అయ్యి ఆమెను ప్రేమించి ఏప్రిల్ 13, 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే కేరళలోని పాలక్కడ్ వికాస్ యొక్క స్వస్థలం కాగా.. వాళ్ళిద్దరూ ప్రస్తుతం అక్కడే తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఎనిమిదేళ్ళ పాప నాలుగేళ్ల బాబు ఉన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ లో బీజేపీ పార్టీ పెద్దలు జ్యోతి ని కొల్లన్‌గోడే పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టారు. దీనితో ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఒకే ఒక్క సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసిందని చెప్పుకోవచ్చు.


జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>