TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/samsung-galaxy-phonescaa77ad2-9a9d-4550-9620-27d830c8bc7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/samsung-galaxy-phonescaa77ad2-9a9d-4550-9620-27d830c8bc7a-415x250-IndiaHerald.jpgశాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..మార్కెట్ లోకి ఎన్నో మొబైల్స్ ను విడుదల చేసింది. ఇప్పుడు కూడా మరో మొబైల్ లాంఛ్ చేయనుంది. ఆ ఫోన్ ఫీచర్స్ ముందు వచ్చిన ఫోన్ల తో పోలిస్తే చాలా బెటర్ అనే టాక్ వినిపిస్తుంది. ఆ ఫోన్ ఎంటి? ఫీచర్స్ ఎంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ఇతర మార్కెట్లలో కూడా త్వరలో లాంచ్ కానుంది. samsung galaxy phones;smart phone;vegetable market;manadesamఆన్ లైన్ లో లీకైన శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోన్ ఫీచర్స్.. ధర ఎంతంటే?ఆన్ లైన్ లో లీకైన శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోన్ ఫీచర్స్.. ధర ఎంతంటే?samsung galaxy phones;smart phone;vegetable market;manadesamSat, 20 Feb 2021 03:00:00 GMTఫోన్ ఫీచర్స్ ముందు వచ్చిన ఫోన్ల తో పోలిస్తే చాలా బెటర్ అనే టాక్ వినిపిస్తుంది. ఆ ఫోన్ ఎంటి? ఫీచర్స్ ఎంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ఇతర మార్కెట్లలో కూడా త్వరలో లాంచ్ కానుంది.


ఫోన్ తాజాగా థాయ్‌ల్యాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్లో కూడా కనిపించింది. ఇందులో 4జీ, 5జీ వేరియంట్లు కూడా ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఇతర వివరాలు కూడా ఇప్పటికే లీకయ్యాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.శాంసంగ్ గెలాక్సీ ఏ72 ఇటీవలే అనాటెల్ బ్రెజిలియన్ సర్టిఫికేషన్ సైట్లో కూడా కనిపించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ72, గెలాక్సీ ఏ52 ఫోన్లు ఒకేసారి లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ72లో 6.7 అంగుళాల ఇన్‌ఫినిటీ-ఓ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉండనుంది.


క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వెరియంట్లు కూడా రానున్నాయి..ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉండనుంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది...బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. యూఎస్‌బీ టైప్-సీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉండనుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే..రూ. 39,800 గా సంస్థ వెల్లడించింది.


అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి లాంఛ్ కానున్న మారుతి సుజుకీ స్విఫ్ట్...!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>