PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-mla-shocks-chandrababu-over-ys-jagans-proposed-three-capitals-issuedaa8e574-704b-4b18-8d96-24ed0320eca9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-mla-shocks-chandrababu-over-ys-jagans-proposed-three-capitals-issuedaa8e574-704b-4b18-8d96-24ed0320eca9-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ గంటా రాజీనామా చేయ‌డంతో ఆయ‌న‌కు ఒక్క‌సారిగా క్రేజ్ పెరిగింది. గంటా కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసి వచ్చిన వ్య‌క్తే. దీంతో ఈ సెంటిమెంట్‌ను ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ఆయ‌న రాజ‌కీయంగా ఇప్పుడు సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వ‌చ్చే నెల‌లో కీల‌క‌మైన విశాఖ మేయ‌ర్ సీటుకు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆ వెంట‌నే గంటా రాజీనామా చేసిన విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జ‌ర‌గ‌డం ఖాయం. ముందుగా రాజీనామా చేసిన గంటా... రెండోసారి ganta srinivas rao;view;andhra pradesh;రాజీనామా;vishakapatnam;assembly;mla;minister;letter;thota chandrasekhar;central government;party;gajuwakaగంటాకు మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గ‌మే... ఈ సారి ఎక్క‌డ నుంచి అంటే ?గంటాకు మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గ‌మే... ఈ సారి ఎక్క‌డ నుంచి అంటే ?ganta srinivas rao;view;andhra pradesh;రాజీనామా;vishakapatnam;assembly;mla;minister;letter;thota chandrasekhar;central government;party;gajuwakaSat, 20 Feb 2021 08:40:00 GMTవిశాఖ కేంద్రంగా రాజ‌కీయాలు మ‌ళ్లీ రంజుగా మారుతున్నాయి. విశాఖ‌ను జ‌గ‌న్ ప‌రిపాల‌నా రాజ‌ధానిగా చేయ‌డంతోనే ఇక్క‌డ రాజ‌కీయం వేడి వేడిగా మారింది.  ఓ వైపు రాజ‌ధాని హ‌డావిడికి తోటు... స్టీల్ ప్లాంట్ ఉద్య‌మం ఉధృతం అయ్యే అవ‌కాశాలు ఎక్కువుగా ఉండ‌డంతో విశాఖ ఇప్పుడు ఏపీ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారింది. రాజ‌కీయంగా సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు.. మ‌ళ్లీ తాను వార్తల్లో నిలిచేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఇదే క‌రెక్ట్ టైంగా తెర‌మీద‌కు వ‌చ్చారు. ఏడేళ్లుగా ఏక‌ధాటిగా మంత్రిగా ఉన్న గంటా ఎమ్మెల్యేగా ఉన్నా రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. వైసీపీలోకి రానివ్వ‌డం లేదు... ఇటు టీడీపీలో ఉండ‌లేక‌పోతున్నారు.

ఇదే అద‌నుగా ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ గంటా రాజీనామా చేయ‌డంతో ఆయ‌న‌కు ఒక్క‌సారిగా క్రేజ్ పెరిగింది. గంటా కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసి వచ్చిన వ్య‌క్తే. దీంతో ఈ సెంటిమెంట్‌ను ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ఆయ‌న రాజ‌కీయంగా ఇప్పుడు సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వ‌చ్చే నెల‌లో కీల‌క‌మైన విశాఖ మేయ‌ర్ సీటుకు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆ వెంట‌నే గంటా రాజీనామా చేసిన విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జ‌ర‌గ‌డం ఖాయం.

ముందుగా రాజీనామా చేసిన గంటా... రెండోసారి స్పీక‌ర్ ఫార్మాట్లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో స్పీక‌ర్ త‌మ్మినేని గంటా రాజీనామాను ఆమోదించ‌డ‌మే మిగిలి ఉంది. నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌రిగినా గంటా పోటీ చేయ‌న‌ని.. ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగిని అక్క‌డ పోటీ చేయిస్తాన‌ని చెపుతున్నారు. దీంతో వ‌చ్చే మైలేజ్‌తోనే 2023 లేదా 24లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా త‌న మైలేజ్ పెంచుకోవాల‌న్న‌దే ఆయ‌న ప్లాన్‌. అప్పుడు ఏ పార్టీ ఊపులో ఉంటే ఆ పార్టీలో చేరాల‌న్న‌దే గంటా టార్గెట్ అని తెలుస్తోంది.

నార్త్‌కు బైబై గాజువాకే టార్గెట్ ?

ప్ర‌తి ఎన్నిక‌కు నియోజ‌క‌వ‌ర్గం మారుతూ వ‌స్తోన్న గంటా ఈ సారి స్టీల్ ఫ్యాక్ట‌రీ ఉద్యోగుల‌తో పాటు కార్మిక సంఘాలు ఎక్కువుగా ఉన్న గాజువాక నుంచి పోటీ చేసేలా ప‌క‌డ్బందీ ప్లాన్‌తో ఉన్నట్టు టాక్ ?  పైగా అక్క‌డ కాపు వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఎక్కువే. పైగా గ‌తంలో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం విజ‌యం సాధించింది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం కాపులు ఎక్కువ ఉన్నార‌నే ఇక్కడ పోటీ చేశారు. ఇక గంటా వ్యూహాత్మ‌కంగా ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయకుండా త‌ర్వాత గాజువాక‌ను ఎంచుకుంటార‌న్న ప్ర‌చారం అయితే విశాఖ‌లో జ‌రుగుతోంది.




పుర పోరు : విశాఖ మేయర్.... టీడీపీకి భలే షాక్ ఇస్తోందిగా...?

నాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..

పురపోరు: విజయనగరంలో ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్..?

పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ఖ‌రారు....! అందుకే ప్రియాంకా గాంధీ మంత‌నాలు..!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు భలే సమస్యగా తయారయ్యాడే ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు తెర‌పై వెలిగిన ప‌ద్మ‌నాభం...

జగడ్డ: వారెవా.. చంద్రబాబు అరిచారు.. నిమ్మగడ్డ కరిచారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>