PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/panchayat-final-phase-electionsadeea996-adbb-4b7f-9cab-73ece5689dba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/panchayat-final-phase-electionsadeea996-adbb-4b7f-9cab-73ece5689dba-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు ఒక రకంగా వైసీపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారాయని వాదన వినిపిస్తోంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బెదిరింపులూ, ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ పరాకాష్టకు చేరాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపించిన సంగతి తెలిసిందే.మునిసిపల్ ఎన్నికల్లో మరీ ఇంత కన్నా దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి ఏమో అని ఆందోళన ఇప్పటి నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టే లాగా నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దానిjagan nimmagadda elections;kumaar;andhra pradesh;district;kanna lakshminarayana;panchayati;cheque;ycp;partyపుర పోరు : ఎస్ఈసీ నిర్ణయం అభయం ఇచ్చినట్టేనా ?పుర పోరు : ఎస్ఈసీ నిర్ణయం అభయం ఇచ్చినట్టేనా ?jagan nimmagadda elections;kumaar;andhra pradesh;district;kanna lakshminarayana;panchayati;cheque;ycp;partySat, 20 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు ఒక రకంగా వైసీపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారాయని వాదన వినిపిస్తోంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బెదిరింపులూ, ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ పరాకాష్టకు చేరాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపించిన సంగతి తెలిసిందే.మునిసిపల్ ఎన్నికల్లో మరీ ఇంత కన్నా దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి ఏమో అని ఆందోళన ఇప్పటి నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టే లాగా నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 

దాని ప్రకారం బలవంతపు ఉపసంహరణ చేయిస్తే రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఒక పక్క మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ఇప్పటికి ఏడాది గడుస్తోంది. మరో సారి ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కొన్ని సందేహాలు చాలా డివిజన్లలో, వార్డుల విషయంలో నెలకొన్నాయి. ఇప్పటికీ ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి బరిలో నిలుస్తారు అనే అంశం మీద స్పష్టత లేదు. 

గత ఏడాది మార్చితో రద్దయిన ఎన్నికలకు ఎట్టకేలకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కదలిక వచ్చినట్లయింది. మునిసిపల్ ఎన్నికలలో నామినేషన్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు బలవంతంగా విత్ డ్రా అయితే వాటిపై దృష్టి ప్రత్యేక దృష్టి సారించాలని నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..ఎవరైనా అభ్యర్థులు బలవంతంగా తమతో నామినేషన్ విత్డ్రా చేయించాలని ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థన పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఒకరకంగా ఇది అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు నయానో భయానో నామినేషన్లు వేయకుండా వేసినవాళ్ళు నామినేషన్ వెనక్కి తీసుకునేలా చూస్తూ వచ్చిన వారికి ఇది మాత్రం చెంపపెట్టులా గానే ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఒక కార్పొరేషన్ ఎనిమిది మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీలో 333 డివిజన్లు వార్డులలో ఎంత మంది బరిలో నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా 2535 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన తర్వాత 2280 మంది బరిలో ఉన్నట్లు తేలింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఎంత మంది బరిలో ఉంటారు అనేది క్లారిటీ రానుంది.




లాయర్ దంపతుల హత్యపై పుట్టా మధు రియాక్షన్

గిన్నిస్ బుక్ రికార్డు విజేత..విజయ నిర్మల నట ప్రస్థానం

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకనుండి ఒక లెక్క..!

అప్పుడు నచ్చిన మణిశర్మ ఇప్పుడు నచ్చట్లేదా..?

మణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>