PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpgఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేదు అంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ సీటు విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడినుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. సీఎం కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతుkcr;kcr;ktr;srinivasa reddy;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;nalgonda;local language;nijam;reddy;partyకేసీఆర్ కు ఇది నిజంగా సవాల్... తుమ్మల ఏం చేస్తారు...?కేసీఆర్ కు ఇది నిజంగా సవాల్... తుమ్మల ఏం చేస్తారు...?kcr;kcr;ktr;srinivasa reddy;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;nalgonda;local language;nijam;reddy;partySat, 20 Feb 2021 12:00:00 GMTటీఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేదు అంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ సీటు విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడినుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది.  సీఎం కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ మూడు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓడిపోతే మాత్రం గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది. టిఆర్ఎస్ పార్టీ అగ్రనేత గా చెప్పుకునే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం ఇప్పటికే కేటీఆర్ తో పాటుగా పలువురు అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారని అంటున్నారు. అయితే రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడం అంత సులువు కాదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో స్థానిక నేతలతో రాజేశ్వర్ రెడ్డి ఇబ్బందిపడే అవకాశం ఉంది అని అంటున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నామా నాగేశ్వరరావు వంటి నేతల నుంచి సహకారం లేదని అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది. కానీ అనూహ్యంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రతిపాదించడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు కూడా ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డికి సహకరిస్తారా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు అయితే గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.


పూజా మనసెందుకు మార్చుకున్నట్లు ?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?

పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!

ఆ సెంటిమెంట్ రిపీట్‌... సాగ‌ర్లో గెలిచేది కాంగ్రెస్సే ?

కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>