Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kyabejieaf3b4f6-1655-47de-b269-a70e3f21433f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kyabejieaf3b4f6-1655-47de-b269-a70e3f21433f-415x250-IndiaHerald.jpg క్యాబేజీ లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి రెండు మాత్రమే ఒకటి రెడ్ క్యాబేజీ, రెండు గ్రీన్ క్యాబేజీ ముఖ్యంగా గ్రీన్ క్యాబేజీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్యాబేజీని పచ్చిగా అయినా తినవచ్చు లేదా ఉడికించుకొని అయినా తినవచ్చు. రుచి మాత్రం కొద్దిగా తీపిగా ఉంటుంది. క్యాబేజీలో విటమిన్స్, ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. అందుకే క్యాబేజీని చాలామంది వాడుతున్నారు. ఇన్ని పోషకాలు ఉన్నా క్యాబేజీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలkyabeji;tara;rasam;vitamin c;iron;vitamin;ulcer;cancer;redక్యాబేజీ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!క్యాబేజీ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!kyabeji;tara;rasam;vitamin c;iron;vitamin;ulcer;cancer;redSat, 20 Feb 2021 03:00:00 GMTరెడ్ క్యాబేజీ, రెండు గ్రీన్ క్యాబేజీ  ముఖ్యంగా  గ్రీన్ క్యాబేజీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్యాబేజీని పచ్చిగా అయినా తినవచ్చు  లేదా ఉడికించుకొని అయినా తినవచ్చు. రుచి మాత్రం కొద్దిగా తీపిగా ఉంటుంది. క్యాబేజీలో విటమిన్స్, ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. అందుకే క్యాబేజీని  చాలామంది వాడుతున్నారు. ఇన్ని  పోషకాలు ఉన్నా క్యాబేజీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 క్యాబేజీ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే క్యాబేజీలో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా  గా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నాశనం  చేస్తాయి.  అందుకే క్యాబేజీని డైట్ లో చేర్చుకోవడం మంచిది.

 క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఫ్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది.

 క్యాబేజీ తినడం వల్ల కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. క్యాబేజీలో బీటా కెరోటిన్ ఉండడంవల్ల కంటి లోపల మచ్చలు రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది.

 ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయడానికి క్యాబేజీని వాడుతారు. క్యాబేజీ  రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే కడుపులో మంటను తగ్గిస్తుంది

 క్యాబేజీని క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. క్యాబేజీని ఉడికించిన తర్వాత క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందుకే బరువు పెరిగే అవకాశం ఉండదు.

 క్యాబేజీ తినడం వల్ల మలబద్దక  సమస్య నుండి బయటపడవచ్చు. ఎందుకంటే క్యాబేజీలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సక్రమంగా పనిచేయుటకు సహాయపడుతుంది. దీనివల్ల మలబద్దక సమస్య రాదు.

 క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయలకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి.  అందుకే తరచూ క్యాబేజీని తినడం మంచిది.

 క్యారేజీ  తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. క్యాబేజీ లో ఉండే ల్యాక్టిక్ ఆమ్లం గొంతు కండరాలు నుంచి ఉపశమనం పొందడానికి దోహద పడతాది. క్యాబేజీ ఆకుల రసాన్ని తాగిన దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : కుప్పం పంచాయితి ఓటమిలో షాకింగ్ నిజాలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>