PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నికల్లో కొవ్వూరు ఫ‌లితం అటూ ఇటూ అయితే ఖ‌చ్చితంగా వ‌నిత‌ను త్వ‌ర‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ మార్పులు , చేర్పుల్లో త‌ప్పిస్తార‌నే వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే ఆమె అవుట్ లిస్టులో ఉంద‌ని.. ఈ ఫ‌లితం తేడా వ‌స్తే జ‌గ‌న్ స‌హించ‌ర‌నే అంటున్నారు. పైగా కొవ్వూరు మునిసిపాల్టీలో గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. అక్క‌డ బ‌ల‌మైన మాస్ లీడ‌ర్ గా ఉండ‌డంతో పాటు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంతో క‌ష్ట‌ప‌డిన ప‌రిమి హరిచ‌ర‌ణ్ ను అనిత ప‌క్క‌న పెట్టేశార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. ysrcp;anitha singer;district;minister;letter;ycp;kovvur;mass;party;mantraపుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!ysrcp;anitha singer;district;minister;letter;ycp;kovvur;mass;party;mantraSat, 20 Feb 2021 10:02:00 GMTఏపీలో వ‌చ్చే నెల 10వ తేదీన జ‌రుగుతున్న మునిసిప‌ల్ ఎన్నిక‌లు అధికార పార్టీలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేల‌ను టెన్ష‌న్ పెట్టిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తేడా వ‌స్తే సీఎం జ‌గ‌న్ ఏ మాత్రం క్ష‌మించే ప్ర‌శ‌క్తే ఉండ‌ద‌ని పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఉన్న మునిసిప‌ల్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు మునిసిప‌ల్ ఎన్నిక‌లు మంత్రి తానేటి వ‌నిత రాజ‌కీయ భ‌విష్య‌త్తును డిసైడ్ చేయ‌నున్నాయి.

ఈ రెండేళ్ల కాలంలో ఆమె మంత్రిగాను... అటు ఎమ్మెల్యేగాను నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో త‌న దైన ముద్ర అయితే ఆమె వేయ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నికల్లో కొవ్వూరు ఫ‌లితం అటూ ఇటూ అయితే ఖ‌చ్చితంగా వ‌నిత‌ను త్వ‌ర‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ మార్పులు , చేర్పుల్లో త‌ప్పిస్తార‌నే వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే ఆమె అవుట్ లిస్టులో ఉంద‌ని.. ఈ ఫ‌లితం తేడా వ‌స్తే జ‌గ‌న్ స‌హించ‌ర‌నే అంటున్నారు. పైగా కొవ్వూరు మునిసిపాల్టీలో గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది.

అక్క‌డ బ‌ల‌మైన మాస్ లీడ‌ర్ గా ఉండ‌డంతో పాటు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంతో క‌ష్ట‌ప‌డిన ప‌రిమి హరిచ‌ర‌ణ్ ను అనిత ప‌క్క‌న పెట్టేశార‌న్న‌ది ఓ పెన్ సీక్రెట్‌. ఆమె సొంత పార్టీలోనే త‌న‌కు గిట్ట‌ని వారిపై రివేంజ్ తీర్చుకుంటున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉండే ఓ సామాజిక వ‌ర్గాన్ని ఆమె ప‌క్క‌న పెడూత రాజ‌కీయం చేస్తుండడంతో వాళ్లంతా ఆమెపై గుర్రుగా ఉన్నారు. టీడీపీకి ఇక్క‌డ నాయ‌కుడు లేక‌పోయినా బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది.  వాళ్లంతా క‌సితో ప‌ని చేస్తున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో కొవ్వూరులో అనిత ప‌ట్టు నిలుపుకుని అధిష్టానం ద‌గ్గ‌ర ప్ల‌స్ అవుతారో ?  లేదా ?  చూడాలి. 


కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కాంగ్రెస్‌లో.. ఒక‌ప్ప‌టి బ్రాహ్మ‌ణ ప్రాధాన్యం నేడేదీ ?

గంటాకు మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గ‌మే... ఈ సారి ఎక్క‌డ నుంచి అంటే ?

పుర పోరు : విశాఖ మేయర్.... టీడీపీకి భలే షాక్ ఇస్తోందిగా...?

నాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..

పురపోరు: విజయనగరంలో ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్..?

పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ఖ‌రారు....! అందుకే ప్రియాంకా గాంధీ మంత‌నాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>