MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purib54cd2bf-85b5-4d87-8811-4f75831fbeb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purib54cd2bf-85b5-4d87-8811-4f75831fbeb8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. అందరి టార్గెట్ ఒక్కటే హీరోగా సెటిల్ అవడమే. నిర్మాత అయినా డైరెక్టర్ అయినా కెమెరా మ్యాన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తమ కొడుకులను హీరోలను చేసి వెండి తెర మీద వారి సత్తా చూడాలనుకోవడమే సరదా. ఆ విధంగా చాలా మంది వస్తే కొద్ది మంది మాత్రమే తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. puri;akash;anil music;shankar;vijay;tollywood;cinema;producer;audience;ismart shankar;director;producer1;silver;joseph vijay;silver screen;mehbooba;romantic;massకొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?puri;akash;anil music;shankar;vijay;tollywood;cinema;producer;audience;ismart shankar;director;producer1;silver;joseph vijay;silver screen;mehbooba;romantic;massSat, 20 Feb 2021 19:30:00 GMTటాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. అందరి టార్గెట్ ఒక్కటే హీరోగా సెటిల్ అవడమే. నిర్మాత అయినా డైరెక్టర్ అయినా కెమెరా మ్యాన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తమ కొడుకులను హీరోలను చేసి వెండి తెర మీద వారి సత్తా చూడాలనుకోవడమే సరదా. ఆ విధంగా చాలా మంది వస్తే కొద్ది మంది మాత్రమే తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.

ఇక మాస్ పల్స్ పూర్తిగా తెలిసిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన తీసే సినిమాల్లో హీరోలు మాట్లాడే భాష పూర్తిగా యూత్ కి కనెక్ట్ అవుతుంది. అంతే కాదు వారి బాడీ లాగ్వేజ్ ని బట్టి కూడా డైలాగ్స్ రాసే టాలెంట్ పూరీదే. ఇక పూరీ హీరోలు పక్కా మాస్ ఇమేజ్ తో ఉంటారు. పూరీ సినిమా టైటిల్స్ కూడా అట్రాక్ట్ అయ్యేలా ఉంటాయి.

ఇన్ని విద్యలు తెలిసిన పూరీ తమ కొడుకు ఆకాష్ ని ఇపుడు పక్కా మాస్ హీరోగా మార్చాలనుకుంటున్నాడుట. పూరీ కొడుకు ఆకాష్ తో మెహబూబా అన్న సినిమా తీశాడు. అయితే అది ఏవ‌రేజ్ గా మిగిలింది. ఇక ఆ తరువాత అనిల్ అన్న కొత్త  డైరెక్టర్ తో తన కధతో ఆకాష్ తో రొమాంటిక్ అన్న సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ ఈ  ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిజల్ట్ ఏంటో చూడాలి.

ఇవన్నీ ఇలా ఉంటే పూరీ మరో అద్భుతమైన టైటిల్ తో కధను  కొడుకు ఆకాష్ కోసం రెడీ చేశాడుట. ఆ మూవీ పేరు చోర్ బజార్. ఇది పక్కా మాస్ అప్పీల్ ఉన్న మూవీగా డిజై చేస్తున్నాడుట. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ తో తనలో మాసిజం ఇంకా తగ్గలేదని చాటుకున్న పూరీ లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో లైగర్ మూవీని తీస్తున్నాడు. ఆ తరువాత తీయబోయే మూవీ కొడుకుదేనని అంటున్నారు. మరి చోర్ బజార్ మూవీ ఆడియన్స్ ఆదరణను ఎలా చోర్ చేస్తుందో చూడాల్సిందే.




టీడీపీని సంతృప్తి పరిచిన నిమ్మగడ్డ...!

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

ఆర్ఆర్ఆర్ షూట్ లో పవన్ ఏం చేస్తున్నాడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>