PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problemsa0964f6d-9127-4fd2-990a-9e6495c0b3d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problemsa0964f6d-9127-4fd2-990a-9e6495c0b3d8-415x250-IndiaHerald.jpgవిద్యార్థులు తీర్చి దిద్దే ఉపాధ్యాయులు.. సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. నెలల తరబడి వేతనాలు లేక.. యాజమాన్యాలను వేడుకుంటున్నారు. కరోనా అందరినీ ఇబ్బంది పెట్టినా.. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీవితాలతో మరింత ఎక్కువగా ఆడుకుంది. నెలల తరబడి వేతనాలు లేక.. కొందరు టీచర్లు చాయ్ దుకాణాలు, కూరగాయల షాపులు పెట్టుకున్నారు. ఇంకొందరు టీచర్ పోస్టు వదిలి..దొరికిన ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్కూళ్ల సంగతి పక్కకు పెడితే.. బడ్జెట్‌ స్కూళ్లే ఎక్కువ. అంటే ఇవి చిన్న స్థాయి స్కూteachers-problems;government;television;job;bike;corporateటీచర్ల వెతలు: పాఠాలు చెప్పే పంతుళ్లకు ఆత్మహత్యలే శరణ్యమా..?టీచర్ల వెతలు: పాఠాలు చెప్పే పంతుళ్లకు ఆత్మహత్యలే శరణ్యమా..?teachers-problems;government;television;job;bike;corporateSat, 20 Feb 2021 10:00:00 GMT
తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్కూళ్ల సంగతి పక్కకు పెడితే.. బడ్జెట్‌ స్కూళ్లే ఎక్కువ. అంటే ఇవి చిన్న స్థాయి స్కూళ్లన్నమాట. వీటిలో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిరాయి ఇండ్లలో ఉంటున్నవారు, ఉద్యోగాలను నమ్ముకుని బైక్‌, టీవీ వంటివి కొనుక్కున్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడ్తున్నారు. రెంటు కట్టలేక, ఈఎంఐలు చెల్లించలేక నానా అవస్థ పడుతున్నారు.

చివరకు వీరి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే.. కొందరు ల్యాప్‌ టాప్‌లు, బైకులు కూడా అమ్ముకుంటున్నారు. ఇంకొందరు ఇన్నాళ్లు దాచుకున్న సొమ్ము ఖర్చుపెడుతున్నారు. మరికొందరు ఉన్న కొద్దిపాటి బంగారం అమ్ముకుంటున్నారు. అవును మరి.. బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు నెలల తరబడి జీతాల్లేవు.. పాఠశాలలు మళ్లీ మొదలైనా.. అరకొర జీతాలతోనే సరిపెడుతున్నారు.

ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు గతంలో ఎరుగనివారు.. సున్నిత మనస్కులు.. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు.. ఈ యాతన భరించలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్న దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఏళ్ల తరబడి సర్కారుకు పన్నుల రూపంలో ఆదాయం అందించిన ఈ స్కూళ్లను కనీసం ఇలాంటి దుస్థితిలోనైనా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ..అలాంటి చొరవ ప్రభుత్వాల నుంచి కనిపించడం లేదు. కోట్లకు కోట్ల సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలకు ప్రైవేటు టీచర్ల కష్టాలు మాత్రం కనిపించడం లేదు. అక్కడక్కడా కొన్ని స్వచ్ఛంద సంఘాలు.. వీరిని ఆదు కుంటున్నాయి. కొందరు పూర్వ విద్యార్థులు తమ పంతుళ్లకు సాయం చేస్తున్నారు.




పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!

కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కాంగ్రెస్‌లో.. ఒక‌ప్ప‌టి బ్రాహ్మ‌ణ ప్రాధాన్యం నేడేదీ ?

గంటాకు మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గ‌మే... ఈ సారి ఎక్క‌డ నుంచి అంటే ?

పుర పోరు : విశాఖ మేయర్.... టీడీపీకి భలే షాక్ ఇస్తోందిగా...?

నాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..

పురపోరు: విజయనగరంలో ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>