PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/minister-mekapati-expects-an-easy-win-in-municipal-elections53375577-1780-41eb-b8cf-8bc4047661a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/minister-mekapati-expects-an-easy-win-in-municipal-elections53375577-1780-41eb-b8cf-8bc4047661a0-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మరోసారి సత్తా చాటుకున్నారు. ఏకగ్రీవాలతోనే బలం నిరూపించుకున్న వైసీపీ, ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేసింది. కొన్నిచోట్ల టీడీపీ తరపున అభ్యర్థులే కరువయ్యారు. దీంతో వైసీపీ రెబల్ అభ్యర్థులే వైసీపీతో పోటీ పడ్డారు. విజేతలు ఎవరైనా తిరిగి వైసీగూటికే చేరుకోవడంతో పార్టీలో సందడి పెరిగింది. తాజాగా మున్సిపల్ ఎన్నకల్లోనూ మంత్రి సునాయాస విజయాన్ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.mekapati gautham reddy;kumaar;gautham new;gautham;sravan;janasena;mekapati goutham reddy;రాజీనామా;scheduled tribes;panchayati;minister;doctor;tdp;local language;ycp;janasena party;march;reddy;joshపురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..mekapati gautham reddy;kumaar;gautham new;gautham;sravan;janasena;mekapati goutham reddy;రాజీనామా;scheduled tribes;panchayati;minister;doctor;tdp;local language;ycp;janasena party;march;reddy;joshSat, 20 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మరోసారి సత్తా చాటుకున్నారు. ఏకగ్రీవాలతోనే బలం నిరూపించుకున్న వైసీపీ, ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేసింది. కొన్నిచోట్ల టీడీపీ తరపున అభ్యర్థులే కరువయ్యారు. దీంతో వైసీపీ రెబల్ అభ్యర్థులే వైసీపీతో పోటీ పడ్డారు. విజేతలు ఎవరైనా తిరిగి వైసీగూటికే చేరుకోవడంతో పార్టీలో సందడి పెరిగింది. తాజాగా మున్సిపల్ ఎన్నకల్లోనూ మంత్రి సునాయాస విజయాన్ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అప్పటికి ఆత్మకూరు మున్సిపాల్టీలో 144 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో వైసీపీ 51, టీడీపీ 26, బీజీపీ 7, జనసేన 4, ఇతరులు 26 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ నేతలు కొన్ని వార్డులను ఏకగ్రీవం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసినా.. రెబల్స్ బెడద మాత్రం వారికి తప్పేలా లేదు. దీంతో వారిని బుజ్జగించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

వైస్ ఛైర్మన్ కీలకం.. బరిలో డాక్టర్ శ్రావణ్..
ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్ కు రిజర్వ్ కావడంతో వైస్ చైర్మన్ పోస్ట్ కీలకంగా మారింది. స్థానిక డాక్టర్, వైసీపీ సీనియర్ నాయకులు శ్రావణ్ కుమార్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 21వ వార్డునుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. వైసీపీ విజయం సాధిస్తే ఆయనే వైస్ చైర్మన్.

ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని 15, 18 వార్డులు ఎస్టీలకు కేటాయించారు. ఆ వార్డుల్లో తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు వైసీపీ, టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆ వార్డుల్లో వైసీపీ, టీడీపీ ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించింది. 15వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా గోపారం వెంకటరమణమ్మ వార్డు వలంటీరు పోస్టుకు రాజీనామ చేసి ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ తరపున చండ్రపాటి మంగమ్మ బరిలో నిలిచారు. 18వ వార్డులో వైసీపీ అభ్యర్ధులుగా ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ వైసీపీకి రెబల్ బెడద తప్పేలా లేదు. ఏది ఏమయినా పంచాయతీ పోరుతో జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి సునాయాస విజయాన్నే ఆశిస్తున్నారు. 


పూజా మనసెందుకు మార్చుకున్నట్లు ?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?

పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!

ఆ సెంటిమెంట్ రిపీట్‌... సాగ‌ర్లో గెలిచేది కాంగ్రెస్సే ?

కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>