PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cm-kcr-kanabaduta-ledu-bhattivikramarka-sanchalana-vyakhyalufc2deb87-e736-4898-97ce-077a29531ce0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cm-kcr-kanabaduta-ledu-bhattivikramarka-sanchalana-vyakhyalufc2deb87-e736-4898-97ce-077a29531ce0-415x250-IndiaHerald.jpgకాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సూర్యాపేట రైతు ముఖాముఖీలో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేట చేరుకున్నా ఆయన.. మొదట చందుపట్ల గ్రామరైతులతో మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇక్కడ జరుగుతున్నది రాజకీయ సమాశం కాదు.. ఎన్నికల సమావేశం అంతకన్నాకాదని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు అమల్లోకి వస్తే.. కోట్లాది రైతాంగ సోదరులు జీవbhatti;kcr;chandu;sriram;vidya;congress;suryapeta;chief minister;electricity;minister;aqua;central government;bhadradri;kusuma jagadish;paritala sriram;mallu bhatti vikramarka;reddy;partyకాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..bhatti;kcr;chandu;sriram;vidya;congress;suryapeta;chief minister;electricity;minister;aqua;central government;bhadradri;kusuma jagadish;paritala sriram;mallu bhatti vikramarka;reddy;partySat, 20 Feb 2021 18:35:46 GMTభట్టి విక్రమార్క మల్లు సూర్యాపేట రైతు ముఖాముఖీలో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేట చేరుకున్నా ఆయన.. మొదట చందుపట్ల గ్రామరైతులతో మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇక్కడ జరుగుతున్నది రాజకీయ సమాశం కాదు.. ఎన్నికల సమావేశం అంతకన్నాకాదని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు అమల్లోకి వస్తే.. కోట్లాది రైతాంగ సోదరులు జీవితాలు దుర్భరంగా మారతాయని భట్టి చెప్పారు. ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. రైతాంగ సోదరులు పడుతున్న బాధను శాసనసభలో మీ గొంతుగా వినిపంచాలనే రైతులతో ముఖాముఖీగా మాట్లాడుందుకు ఇక్కడకు వచ్చానని భట్టి చెప్నారు. రైతులతో ముఖాముఖీ అనేది విమర్శలు చేసే వేదికకాదు.. కేవలం వాస్తవాలు, రైతుల కష్టాలు చర్చించుకునే సమావేశం మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు.


మంత్రి చెబుతున్నట్లు ఇవి కాళేశ్వరం నీళ్లు కావు.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిన శ్రీరాంసాగర్ ఎస్సారెస్పీ.. డిండీ ప్రాజెక్టుల వల్ల వచ్చిన నీళ్లని  వివరించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడకు తీసుకువచ్చిన నీటి చుక్కకూడా లేదని.. లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమని భట్టి తీవ్రస్థాయిలో చెప్పారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చిన నీళ్లను.. కాళేశ్వరం నీళ్లని ప్రజలకు, రైతులకు అబద్దాలు చెబుతారా? అని  ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎస్సారెస్పీ ఫేజ్ 2 కాలువ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలని భట్టి వివరించారు. ఇక్కడకు వచ్చే నీళ్లు.. మొదట శ్రీరామ్ సాగర్/కడెం ప్రాజెక్టుల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి... అక్కడనుంచి మిడ్ మానేరుకు అక్కడనుంచి లోయర్ మానేరుకు.. చివరగా ఇక్కడకు నీళ్లు పారుతున్నాయని చెప్పారు.


ఈ ఏడేళ్లుగా కేసీఆర్ కొత్తగా కట్టిన ఒక్క ప్రాజెక్ట కూడా లేదన్నారు. రాత్రిపూటో.. పగలో మత్తులో మాట్లాడే మాటలు ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా.. కాళేశ్వరం లెక్కలు.. అప్పులు.. పారిన నీళ్లపై రాష్ట్రంలో మీరు ఎక్కడ చర్చకు పెట్టినా నేను సిద్ధమే.. వచ్చి వివరిస్తా.. అని ఛాలెంజ్ చేశారు.  2015లో మొదలు పెట్టిన భద్రాద్రి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. అందులోనూ.. ఈ ప్రాజెక్టులో వాడుతున్న సబ్ క్రిటికల్ టెక్నాలజిని 2018లో నాటి ప్రభుత్వం మూసేసిందని చెప్పారు. ఇందులోనూ దాదాపు రూ. 10 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతోందని అన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపైనా.. రూ. 10 కోట్ల అవినీతినైనా.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? నేను లెక్కలతో సహా వివరిస్తా.. అంటూ స‌వాల్ విసిరారు.





టీడీపీని సంతృప్తి పరిచిన నిమ్మగడ్డ...!

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

ఆర్ఆర్ఆర్ షూట్ లో పవన్ ఏం చేస్తున్నాడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>