PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌ను ఎదుర్కొవ‌డం క‌మ‌ల‌నాథుల‌కు కాస్త క‌ష్టంగా మారుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. నాగార్జున సాగ‌ర్‌లో ఇప్ప‌టికి వారి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ లేదు. కాంగ్రెస్ నుంచి దిగ్గ‌జ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. ఇటీవ‌ల జానారెడ్డి కూడా స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే టీఆర్ ఎస్ మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే ముగ్గురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే నోటిఫికేష‌న్ త‌ర్bjp;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;hosta;congress;janareddy;partyనాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..నాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..bjp;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;hosta;congress;janareddy;partySat, 20 Feb 2021 08:08:18 GMTనాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌ను ఎదుర్కొవ‌డం క‌మ‌ల‌నాథుల‌కు కాస్త క‌ష్టంగా మారుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. నాగార్జున సాగ‌ర్‌లో ఇప్ప‌టికి వారి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ లేదు. కాంగ్రెస్ నుంచి దిగ్గ‌జ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. ఇటీవ‌ల జానారెడ్డి కూడా స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే టీఆర్ ఎస్ మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే ముగ్గురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే నోటిఫికేష‌న్ త‌ర్వాత ప్ర‌క‌టిస్తే ఆల‌స్య‌మ‌వుతుంద‌ని పార్టీ శ్రేణుల విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మ‌రో నాలుగైదు రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నెలాఖ‌రుకు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌చ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌ర‌గుతుతోంది.


అయితే ఈక్ర‌మంలోనే బీజేపీ నుంచి మాత్రం అభ్య‌ర్థుల పేర్లు కూడా వినిపించ‌డం లేదు. బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని ఆ పార్టీ నేత‌లే ఆఫ్ ది రికార్డులో పేర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక స‌మ‌యంలో అభ్య‌ర్థిని ఎంతో ముందుగా ప్ర‌క‌టించినా పార్టీ అధిష్ఠానం నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలో మాత్రం మ‌ల్ల‌గుల్లాలు ప‌డాల్సి వ‌స్తోంది. ఇక్క‌డ గెలుపు క‌ష్టమేన‌ని ఆ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. పార్టీ శ్రేణుల బ‌లం పెద్ద‌గా లేక‌పోవ‌డం, ఖ‌ర్చు కూడా ఎక్కువయ్యే అవ‌కాశం వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తున్న ఆశావ‌హులు పోటీ చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని తెలుస్తోంది.


ఇదిలా ఉండ‌గా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమ‌ని చాటాల‌ని భావిస్తోంది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉంటారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకుండానే సాగర్‌లో అభ్యర్థిని ఖరారు చేసుకుని దూకుడు పెంచింది హస్తం పార్టీ. దాంతో జానారెడ్డి క్యాంపెయిన్‌ స్పీడ్‌ పెంచారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ వంతు ఎప్పుడన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా సాగర్‌లో గెలుపు బీజేపీకి కత్తిమీద సాములా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారైన తర్వాత మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకోనుంద‌ని తెలుస్తోంది.


కృష్ణా జిల్లాలో... పాపం మాజీ ఎమ్మెల్యేలు

పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ఖ‌రారు....! అందుకే ప్రియాంకా గాంధీ మంత‌నాలు..!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు భలే సమస్యగా తయారయ్యాడే ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు తెర‌పై వెలిగిన ప‌ద్మ‌నాభం...

జగడ్డ: వారెవా.. చంద్రబాబు అరిచారు.. నిమ్మగడ్డ కరిచారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి హీటెక్కించేస్తున్న తికాయత్ పిలుపు

హెరాల్డ్ ఎడిటోరియల్ : కుప్పం పంచాయితి ఓటమిలో షాకింగ్ నిజాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>