PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpgగతేడాది మొదలైన మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతకు టీడీపీ విజయవాడ మేయర్‌ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. దీనిపై అప్పుడు మాట్లాడ‌ని న‌గ‌ర టీడీపీ నేత‌లు ఇప్పుడు మాత్రం శ్వేత‌కు వ్యతిరేకంగా వర్గపోరు ప్రారంభించారు. శ్వేత‌కు మేయ‌ర్ ఇస్తే కుద‌ర‌ద‌ని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటు సెంట్రల్‌లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో chandra babu;nani;bonda;vijayawada;devineni avinash;mp;king;mla;minister;letter;tdp;central government;partyపుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?chandra babu;nani;bonda;vijayawada;devineni avinash;mp;king;mla;minister;letter;tdp;central government;partySat, 20 Feb 2021 10:22:00 GMTఏపీలో నాలుగో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌లు రేప‌టితో ముగుస్తున్నాయి. ఆ వెంట‌నే మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న కార్పొరేష‌న్ విజ‌య‌వాడ‌. రాజ‌ధాని కేంద్రంగా విజ‌య‌వాడ‌లో పాగా వేసేందుకు టీడీపీకి ఎన్నో సానుకూల‌త‌లు ఉన్నాయి. అయితే తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌ల‌తో పార్టీ చేజేతులా కార్పొరేష‌న్‌ను కోల్పోతుందా ? అన్న సందేహాలు ఇప్ప‌టికే వ‌చ్చేశాయి. వైసీపీలో మంత్రి వెల్లంప‌ల్లి, బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు, తూర్పు ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ క‌సితో కార్పొరేష‌న్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

టీడీపీ వాళ్లు మాత్రం గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు. ఎంపీ కేశినేని నానిని మిగిలిన న‌గ‌ర నేత‌లు దూరం పెడుతున్నారు. గతేడాది మొదలైన మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతకు టీడీపీ విజయవాడ మేయర్‌ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. దీనిపై అప్పుడు మాట్లాడ‌ని న‌గ‌ర టీడీపీ నేత‌లు ఇప్పుడు మాత్రం శ్వేత‌కు వ్యతిరేకంగా వర్గపోరు ప్రారంభించారు. శ్వేత‌కు మేయ‌ర్ ఇస్తే కుద‌ర‌ద‌ని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటు సెంట్రల్‌లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న సైతం నాని కుమార్తె అభ్య‌ర్థిత్వాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తోన్న ప‌రిస్థితి. ఇక నాని అయితే తాను ఎంపీగా గెలిచాన‌ని.. ఓడిన వాళ్లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సామంత రాజుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. త‌మ కుమార్తె అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకించే వారిని టార్గెట్ చేశారు. తమ కుమార్తె వద్దని అధినేత చంద్రబాబు చెబితే నామినేషన్‌ వెనక్కి తీసుకుంటానని ప్రకటించడం సంచలనంగా మారింది. బోండా, గద్దె కుటుంబాల నుంచి మేయర్‌ అభ్యర్ధిని నిలబెట్టుకోవచ్చని సూచించారు. ఏదేమైనా పార్టీ గెలిచే కార్పొరేష‌న్ల‌లో ముందు వ‌రుస‌లో ఉన్న బెజ‌వాడ టీడీపీని గ్రూపుల గోల ముంచేసేలా ఉంది. 


పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!

ఆ సెంటిమెంట్ రిపీట్‌... సాగ‌ర్లో గెలిచేది కాంగ్రెస్సే ?

కాపు వేద‌న‌: మంత్రిగా ఉన్నారు.. కానీ.. నాటి ప్రాధాన్యం నేడేదీ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కాంగ్రెస్‌లో.. ఒక‌ప్ప‌టి బ్రాహ్మ‌ణ ప్రాధాన్యం నేడేదీ ?

గంటాకు మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గ‌మే... ఈ సారి ఎక్క‌డ నుంచి అంటే ?

పుర పోరు : విశాఖ మేయర్.... టీడీపీకి భలే షాక్ ఇస్తోందిగా...?

నాగార్జున సాగ‌ర్‌లో క‌మ‌ల‌నాథుల గోస‌.. అభ్య‌‌ర్థి కోసం బీజేపీ వెతుకులాట‌..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>