PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sun-risersa3f5e3c2-78c5-4d53-ac24-ac291a69f496-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sun-risersa3f5e3c2-78c5-4d53-ac24-ac291a69f496-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యంపై మాత్రం తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. స్ఖానిక క్రికెటర్లను , హైదరాబాదీలను పట్టించుకోలేదనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ ఆటగాళ్లను ఒక్కరినీ కూడా తీసుకోలేదు.కాని ఇతర ప్రాంచైజీలు మాత్రం లోకల్ క్రికెటర్లకు తమ జట్టులో అవకాశం కల్పించాయి.sun risers;yajamanya;mumbai;hyderabad;cricket;mini;danam nagender;mla;local language;arjun 1సన్ రైజర్స్ కు ఎమ్మెల్యే వార్నింగ్సన్ రైజర్స్ కు ఎమ్మెల్యే వార్నింగ్sun risers;yajamanya;mumbai;hyderabad;cricket;mini;danam nagender;mla;local language;arjun 1Sat, 20 Feb 2021 14:13:51 GMTహైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యంపై మాత్రం తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. స్ఖానిక క్రికెటర్లను , హైదరాబాదీలను పట్టించుకోలేదనే ఆరోపణలు అన్ని  వర్గాల నుంచి వస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ ఆటగాళ్లను ఒక్కరినీ కూడా తీసుకోలేదు.కాని ఇతర ప్రాంచైజీలు మాత్రం లోకల్ క్రికెటర్లకు తమ జట్టులో అవకాశం కల్పించాయి.

          సన్ రైజర్స్ యాజమాన్యం తీరుపై  ఇప్పటికే భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్  బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదీలను తీసుకోకుండా జట్టు కూర్పు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ముంబై టీమ్ మేనేజ్ మెంట్ అక్కడి లోకల్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుందని.. అందుకే అర్జున్ టెండుల్కర్ ను తీసుకున్నారని చెప్పారు. ముంబై తరహాలోనే సన్ రైజర్స్ కూడా స్థానిక క్రికెటర్లను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని అజారుద్దీన్ నిలదీశారు.ఇలా అయితే లోకల్ ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.

  అజారుద్దీన్  బాటలోనే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇదే రీతిలో స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన డేవిడ్ వార్నర్.. సన్ రైజర్స్  జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడని చెప్పారు. మ్యాచ్ ఫిక్సింగులో చిక్కుకున్న ప్లేయర్ ను కెప్టెనుగా పెట్టుకుని.. స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాదులో సత్తా ఉన్న క్రికెటర్లకు కొరత లేదన్నారు దానం నాగేందర్. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాదు ఆటగాళ్లు లేకపోవడం దారుణమన్నారు.  ఇప్పటికైనా హైదరాబాదు ఆటగాళ్లకు సన్ రైజర్స్ టీమ్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతై ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఇదే తీరు కొనసాగితే హైదరాబాదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.





డిలీట్ చేసిన సీన్స్ కి ఇంత క్రేజ్ ఏంటి ?

అప్పుడు నచ్చిన మణిశర్మ ఇప్పుడు నచ్చట్లేదా..?

మణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>