Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tamilrockers-relesead-all-movies-in-hd-formats23f4dceb-4135-4d70-8065-8d61c1452d34-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tamilrockers-relesead-all-movies-in-hd-formats23f4dceb-4135-4d70-8065-8d61c1452d34-415x250-IndiaHerald.jpgమళయాళ సినిమా దృశ్యం-2.. తమిళ సినిమా చక్ర.. తెలుగు సినిమాలు నాంది, కపటధారి, పొగరు సినిమాలన్నింటికీ తమిళ రాకర్స్ దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. అన్ని సినిమాలూ విడుదలైన తొలిరోజే హెచ్‌డీ ప్రింట్‌లను తమ సైట్లో విడుదల చేసేసింది. దీంతో ఈ సినిమాలకు భారీ నష్టాలు ఏర్పడనున్నాయి. అన్ని భాషల్లో సంచలన విజయం సాధించిన..tamilrockers;allari naresh;arjun sarja;vishal krishna;cinema;amazon;dhruv;tamil;february;hero;arjun 1;allari;chitramఈ రోజు రిలీజైన అన్ని సినిమాలూ హెచ్‌డీలో.. తమిళ్ రాకర్స్ దారుణంఈ రోజు రిలీజైన అన్ని సినిమాలూ హెచ్‌డీలో.. తమిళ్ రాకర్స్ దారుణంtamilrockers;allari naresh;arjun sarja;vishal krishna;cinema;amazon;dhruv;tamil;february;hero;arjun 1;allari;chitramSat, 20 Feb 2021 23:18:00 GMTఇంటర్నెట్ డెస్క్: మళయాళ సినిమా దృశ్యం-2.. తమిళ సినిమా చక్ర.. తెలుగు సినిమాలు నాంది, కపటధారి, పొగరు సినిమాలన్నింటికీ తమిళ రాకర్స్ దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. అన్ని సినిమాలూ విడుదలైన తొలిరోజే హెచ్‌డీ ప్రింట్‌లను తమ సైట్లో విడుదల చేసేసింది. దీంతో ఈ సినిమాలకు భారీ నష్టాలు ఏర్పడనున్నాయి. అన్ని భాషల్లో సంచలన విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఇటీవల దృశ్యం2 ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ఈ సినిమాపై పైరసీ వెబ్‌సైట్ తమిళ్‌రాకర్స్ కోలుకోలేని దెబ్బ తీసింది.

అమెజాన్ ప్రైమ్‌లో దృశ్యం 2 సినిమా నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్ రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సినిమాను అమెజాన్‌లో ప్రైమ్ ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాపై ఈ చిత్రానికి సంబంధించిన పైరసీ కాపీని తన వెబ్‌సైట్స్‌లో ఉంచింది. హెచ్ డీ ప్రింట్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వడంతో అమెజాన్‌కు భారీ నష్టం ఏర్పడనుంది.

ఇక దృశ్యం సినిమాతో పాటు, అల్లరి నరేశ్ నటించిన తెలుగు సినిమా నాంది, అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ్ సర్జా తొలిసారిగా హీరోగా చేసిన పొగరు, తమిళ హీరో విశాల్ నటించిన చక్ర సినిమాలను కూడా తమిళ్‌రాకర్స్ భారీగా దెబ్బతీసింది. ఈ సినిమాల హెడ్‌డీ, పైరసీ ప్రింట్‌లను కూడా తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. సినిమాలన్నీ ఈ రోజే విడుదలైనప్పటికీ అప్పుడే పైరసీ వెబ్‌సైట్‌లో హెచ్‌డీ కాపీలు దర్శనమివ్వడంతో ఆయా సినిమాల నిర్మాతలు లబోదిబోమంటున్నారు.
ఇదిలా ఉంటే గతంలో తమిళ్‌రాకర్స్ లీకేజ్‌లపై విశాల్ యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు విశాల్ సినిమానే మళ్లీ పైరసీకి గురి కావడం గమనార్హం.


కరోనా రోగులకు ప్రాణాంతకం మ్యూకోర్‌ మైకోసిస్‌ .. నిపుణుల హెచ్చరిక..

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>