PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-gold-loversd3b8afd9-6523-4fe0-81fe-0f38fadea68b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-gold-loversd3b8afd9-6523-4fe0-81fe-0f38fadea68b-415x250-IndiaHerald.jpgపసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడంతో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. అమెరికా బాండ్ ఈల్డ్ పెరగడం..బంగారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. మూడు రోజులుగా బంగారం ధరల పతనం కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌ ...తాజాగా నేల చూపులు చూస్తోంది. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గుతుండడంతో .. బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.good news for gold lovers;american samoa;gold;capital;silver;internationalబంగారం ప్రేమికులకు శుభవార్త..!బంగారం ప్రేమికులకు శుభవార్త..!good news for gold lovers;american samoa;gold;capital;silver;internationalSat, 20 Feb 2021 21:00:00 GMTపసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడంతో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. అమెరికా బాండ్ ఈల్డ్ పెరగడం..బంగారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు.

మూడు రోజులుగా బంగారం ధరల పతనం కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌ ...తాజాగా నేల చూపులు చూస్తోంది. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గుతుండడంతో .. బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌పై 350 రూపాయలు తగ్గి.. 45 వేల 550 రూపాయల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ విషయానికొస్తే 380 తగ్గి, 49 వేల 690 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 350 తగ్గి 43 వేల 400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ 380 తగ్గి 47 వేల 350 రూపాయలు పలికింది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం 43 వేల 400 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ 47 వేల 350 వద్ద కొనసాగుతోంది.

ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 0.2 శాతం పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 46 వేల145 రూపాయలకు దిగొచ్చింది. గత 8 నెలల్లో ఇది కనిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. కేజీ వెండి ధర 1 శాతం తగ్గుదలతో 68 వేల 479 రూపాయలకు క్షీణించింది. కాగా బంగారం ధర గత ఏడాది ఆగస్ట్ నెలలో 10 గ్రాములు ధర 56 వేలకు పైగా పలికింది. అప్పటి నుంచి చూస్తే ప్రస్తుతం బంగారం ధర 10 వేలకు పైగా తగ్గిందని చెప్పొచ్చు.


సెట్ లో స్మోక్ చేసిన ప్రభాస్.. కోపంతో డైరెక్టర్ ఏం చేశాడంటే..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>