PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/burden55cf27b5-206f-4e01-814d-33aff85fa1df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/burden55cf27b5-206f-4e01-814d-33aff85fa1df-415x250-IndiaHerald.jpgఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ఇక నిత్యావసరాల ధరల గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్ బండ రేటు కూడా భారీగా పెరిగింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత సుమారు రూ.230 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా.burden;petrol;diesel;vegetable marketసామాన్యుడిపై మరోభారం.. ఇలా అయితే జీవనం కష్టమే..!?సామాన్యుడిపై మరోభారం.. ఇలా అయితే జీవనం కష్టమే..!?burden;petrol;diesel;vegetable marketSat, 20 Feb 2021 07:00:00 GMTపెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై అదనపు భారం పడనుంది. ఇక నిత్యావసరాల ధరల గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్ బండ రేటు కూడా భారీగా పెరిగింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత సుమారు రూ.230 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా. పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఈ నెలలోనే వరుసగా 11 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తాజాగా, పాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం పాల ధర బహిరంగ మార్కెట్ లో లీటరు రూ.60గా ఉంది. పదకొండు రోజుల నుంచి డీజిల్ రేట్లు ఏకధాటిగా పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా పెరగడంతో ఆ భారం వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పశువుల దాణా కోసం, సేకరించిన పాలను విక్రయించడాయినికి అయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నట్లు పాల ఉత్పత్తి దారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం పెరిగిన ధరలను ప్రజలపై వేయక తప్పదని ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెరిగే పాల ధర కనీసం లీటర్ మీద రూ.2 వరకు పెరగొచ్చని ప్రతినిధి చెప్పారు. భవిష్యత్‌లో ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పాల ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాబట్టి వినియోగదారులపై భారం వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరలను అనుసరించి రవాణా ఛార్జీలు, పశువుల దాణా, సేకరించిన పాలను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలు కలిపి తడిసి మోపెడవుతాయని, ఆ ఖర్ఛులు మొత్తం కలిపి పాల వినియోగదారులకు మరింత భారం కానుందని పాల డెైయిరీ యజమానులు తెలియజేస్తున్నారు.


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు భలే సమస్యగా తయారయ్యాడే ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు తెర‌పై వెలిగిన ప‌ద్మ‌నాభం...

జగడ్డ: వారెవా.. చంద్రబాబు అరిచారు.. నిమ్మగడ్డ కరిచారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి హీటెక్కించేస్తున్న తికాయత్ పిలుపు

హెరాల్డ్ ఎడిటోరియల్ : కుప్పం పంచాయితి ఓటమిలో షాకింగ్ నిజాలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>