MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevieace22c7-91c7-44e2-bee9-797eeb05edb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevieace22c7-91c7-44e2-bee9-797eeb05edb1-415x250-IndiaHerald.jpgఅప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా "కొండవీటి దొంగ" సినిమా పేరు వినగానే చాలు, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంటుంది. మెగాస్టార్ నటించిన తీరు, ఈ సినిమా కథ,కథనం అన్నీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. తెలుగు సినీ పరిశ్రమనే ఒక ఊపు ఊపిన ఈ సినిమా, భారత సినీ ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసేలా చేసింది. అంతలా ఆల్ టైమ్ రికార్డులు సాధించి, ఇప్పటికీ టీవీలో వచ్చినా సరే మిస్ కాకుండా చూస్తూ వుంటారు చాలామంది.. అయితే ఈ సినిమా విశేషాలు ఏమిటో ఇప్పుchiranjeevi;chiranjeevi;amrish puri;ilayaraja;sridevi kapoor;vijayashanti;geetha;paruchuri brothers;puri jagannadh;vijayalakshmi;cinema;sangeetha;film industry;industry;thief;heroine;jagadeka veerudu athiloka sundari;dongaఅప్పట్లో చిరంజీవి నటించిన ఆ సినిమా సాధించిన షేర్ చూస్తే ఇప్పటికీ షాక్ అవ్వాల్సిందే..!అప్పట్లో చిరంజీవి నటించిన ఆ సినిమా సాధించిన షేర్ చూస్తే ఇప్పటికీ షాక్ అవ్వాల్సిందే..!chiranjeevi;chiranjeevi;amrish puri;ilayaraja;sridevi kapoor;vijayashanti;geetha;paruchuri brothers;puri jagannadh;vijayalakshmi;cinema;sangeetha;film industry;industry;thief;heroine;jagadeka veerudu athiloka sundari;dongaSat, 20 Feb 2021 17:00:00 GMTసినిమా పేరు వినగానే చాలు, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంటుంది. మెగాస్టార్ నటించిన తీరు, ఈ సినిమా కథ,కథనం అన్నీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. తెలుగు సినీ పరిశ్రమనే ఒక ఊపు ఊపిన ఈ సినిమా, భారత సినీ ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసేలా చేసింది. అంతలా ఆల్ టైమ్ రికార్డులు సాధించి, ఇప్పటికీ టీవీలో వచ్చినా సరే మిస్ కాకుండా చూస్తూ వుంటారు చాలామంది.. అయితే ఈ సినిమా విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిరంజీవి వరుస ఫ్లాప్ లతో కమర్షియల్ గా ఇబ్బంది పడుతున్న సమయంలో 1990 సంవత్సరంలో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కొండవీటి దొంగ సినిమా ద్వారా చిరంజీవి కెరియరే మారిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమాను శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించగా, యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే రాశారు. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ ను శ్రీదేవి గా అనుకున్నారు. కానీ ఆమె ఎన్నో షరతులను విధించడంతో, పరుచూరి బ్రదర్స్ విజయశాంతి పేరును దర్శకనిర్మాతలకు చెప్పడం, సినిమా యూనిట్ అంతా ఓకే చెప్పడంతో ఆమె పేరు ఫైనల్ చేశారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా అమ్రిష్ పూరి నటన హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా తొలి 70 ఎంఎం సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా ఎన్నో సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించడం తో చిరంజీవి కెరియర్ లోనే ఇది బెస్ట్ సంగీతం గా  ఈ సినిమా నిలిచింది.  ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ట్రెండ్ గానే ఉన్నాయి.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత,అప్పటి అగ్ర హీరోల రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి, అత్యంత భారీ విజయాన్ని తన అకౌంట్లో వేసుకుంది ఈ చిత్రం. అయితే విడుదలైన మొదటి వారం మొత్తం 74 లక్షల రూపాయల షేర్ ను సాధించింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా మొదటివారంలో ఇంత వసూలు చేయలేదు అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవికి గాయాలయ్యాయి. అయినా సరే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, గాయాలతోనే సినిమా షూటింగ్ కి వెళ్ళాడు.




'నితిన్ తో గతంలోనే ఆ సినిమా చేయాల్సింది.. కానీ'.? సంచలన విషయాలు బయటపెట్టిన చెక్ సినిమా దర్శకుడు..!!

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

ఆర్ఆర్ఆర్ లోకి పవన్ కళ్యాణ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుర పోరు : నర్శీపట్నం బరిలో అయ్యన్న కుటుంబం... బస్తీ మే సవాల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>