HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dry-coconut22264f3e-c235-426a-86d7-7454ad8759a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dry-coconut22264f3e-c235-426a-86d7-7454ad8759a8-415x250-IndiaHerald.jpgకొబ్బరికాయ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఇప్పటివరకు తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రస్తుతం రాబోయే వేసవి కాలంలో కొబ్బరి కాయ లోని కొబ్బరి నీళ్ళు వేసవి తాపాన్ని తగ్గించడానికి, మరీ ముఖ్యంగా చల్లదనాన్ని చేకూర్చడానికి కొబ్బరినీళ్లు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఎండుకొబ్బరి కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మనలో చాలామంది ఎండుకొబ్బరి లో ట్యాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుందనే అపోహతో ఉంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. dry coconut;iron;heart;ulcer;cancer;copper;shaktiఎండు కొబ్బరి ని తింటున్నారా..? అయితే గమనించాల్సిన విషయం ఏమిటో తెలుసా..!ఎండు కొబ్బరి ని తింటున్నారా..? అయితే గమనించాల్సిన విషయం ఏమిటో తెలుసా..!dry coconut;iron;heart;ulcer;cancer;copper;shaktiSat, 20 Feb 2021 13:40:00 GMT
ఎండిన కొబ్బరి లో ఫైబర్,కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఎండు కొబ్బరి లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అంతేకాకుండా సగటు ఆరోగ్యవంతమైన పురుషునికి రోజుకు 38 గ్రాముల పీచు పదార్థం అవసరమైతే, మహిళలకు 25 గ్రాముల పీచు అవసరం. అయితే ఇదంతా ఎండు కొబ్బరి ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఎండు కొబ్బరిని చేర్చడం వల్ల అల్జీమర్స్ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఎండు కొబ్బరి లో సెలీనియం పుష్కళంగా లభించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ని పెంపొదిస్తుంది. అలాగే ఎండు కొబ్బరిలో ఖనిజాలు సమృద్దిగా లభించడం వల్ల పురుషులలో వచ్చే వంధ్యత్వ లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే సెలీనియం వంధ్యత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రోజు వీలైన పద్ధతిలో ఎండుకొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.

ఎండు కొబ్బరి లో ఉండే అనేక పోషకాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడతాయి. అంతేకాకుండా పెద్దప్రేగు తోపాటు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని భయంకరమైన క్యాన్సర్లను దూరం చేసుకోవడానికి ఎండుకొబ్బరి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య, మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.




నాంది సూపర్ హిట్ టాక్.. బాధలో శర్వానంద్ !

అప్పుడు నచ్చిన మణిశర్మ ఇప్పుడు నచ్చట్లేదా..?

మణిశర్మకి చిరు షాక్.. రంగంలోకి డీఎస్పీ ?

పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>