MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-these-two-came-at-same-time-what-will-happen-to-boxoffice3f1f8e87-c946-42d2-b49c-1246da84d1de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-these-two-came-at-same-time-what-will-happen-to-boxoffice3f1f8e87-c946-42d2-b49c-1246da84d1de-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల సినిమాలు వస్తున్నాయి అంటే చాలు వారి అభిమానుల తో పాటు ఇతర ఆడియన్స్ లో కూడా మంచి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక చిరంజీవి తరువాత ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఇద్దరు బడా హీరోలు సమానమైన క్రేజ్ తో పాటు మార్కెట్ ని కలిగి ఉన్న విషయం తెల్సిందే. అయితే వీరిద్దరూ గతంలో కొన్ని సార్లు కొద్దిపాటి గ్యాప్ లో బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలతో తలపడ్డారు. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సpawan-kalyan;mahesh-babu;pawan;chiranjeevi;mahesh;nidhhi agerwal;suresh;geetha;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;krish;m m keeravani;nidhi;parasuram;pawan kalyan;ram pothineni;shankar;sriram;thaman s;makar sakranti;india;andhra pradesh;rbi;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;festival;producer;audience;ismart shankar;remake;producer1;vegetable market;thief;heroine;yuva;mythri movie makers;venu sreeram;gmb entertainments;dubai;dongaవామ్మో .... ఈ ఇద్దరూ ఒకేసారి వస్తే ఇంకేమైనా ఉందా ....??వామ్మో .... ఈ ఇద్దరూ ఒకేసారి వస్తే ఇంకేమైనా ఉందా ....??pawan-kalyan;mahesh-babu;pawan;chiranjeevi;mahesh;nidhhi agerwal;suresh;geetha;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;krish;m m keeravani;nidhi;parasuram;pawan kalyan;ram pothineni;shankar;sriram;thaman s;makar sakranti;india;andhra pradesh;rbi;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;festival;producer;audience;ismart shankar;remake;producer1;vegetable market;thief;heroine;yuva;mythri movie makers;venu sreeram;gmb entertainments;dubai;dongaSat, 20 Feb 2021 13:34:45 GMTటాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల సినిమాలు వస్తున్నాయి అంటే చాలు వారి అభిమానుల తో పాటు ఇతర ఆడియన్స్ లో కూడా మంచి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక చిరంజీవి తరువాత ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఇద్దరు బడా హీరోలు సమానమైన క్రేజ్ తో పాటు మార్కెట్ ని కలిగి ఉన్న విషయం తెల్సిందే. అయితే వీరిద్దరూ గతంలో కొన్ని సార్లు కొద్దిపాటి గ్యాప్ లో బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలతో తలపడ్డారు. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ఇద్దరు బడా స్టార్ హీరోలిద్దరి సినిమాలు మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వనున్నాయని అంటున్నారు. 

ఇక ప్రస్తుతం మహేష్ బాబు, యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం లో చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్ధిక నేరస్థుడి పాత్ర చేస్తున్నట్లు టాక్. కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవల మన దేశ బ్యాంకులను కుదిపేసిన పలు ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క తొలి షెడ్యూల్ దుబాయ్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో జరుగుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేసారు పవన్ కళ్యాణ్. 

మరోవైపు కొద్దిరోజుల క్రితం అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నారు పవన్. కాగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుండగా ఇందులో పవన్ కళ్యాణ్, ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తన్నట్లు టాక్. కాగా ఈ మూవీ ని కూడా సంక్రాంతి బరిలో నిలపాలనేది నిర్మాత ఏ ఎం రత్నం ఆలోచన అని, అందుకే ప్రస్తుతం దీని షూట్ ని ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వేగవంతంగా చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా 2022 సంక్రాంతికి పవర్ స్టార్, సూపర్ స్టార్ ల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలుస్తాయో లేదో పక్కాగా తెలియాలి అంటే పూర్తి కన్ఫర్మేషన్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే అని ఒకవేళ అదే కనుక జరిగితే బాక్సాఫీస్ సునామి తప్పదని అంటున్నారు విశ్లేషకులు..... !!  


పురపోరు: మంత్రి మేకపాటికి సునాయాస విజయం..

విజయనిర్మల రికార్డ్ బద్ధలు కొట్టడం అసాధ్యమే...?

ర‌వికృష్ణ‌ న‌వ్య స్వామిలు పెళ్లి చేసుకోబోతున్నారా.. హింట్ ఇదేనా..!?

పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్‌లో ఊపు.. కారులో కంగారు

పుర పోరు: టీడీపీ చేజేతులా ఆ కార్పొరేష‌న్లో ఓడుతోందా ?

పుర పోరు: ఆ మ‌హిళా మంత్రిని వ‌ర్గ పోరు ముంచేస్తుందా... రివేంజ్ పాలిటిక్స్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>