MoviesSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimeb47b9586-63a0-4fe5-a287-a70de1c42dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimeb47b9586-63a0-4fe5-a287-a70de1c42dbe-415x250-IndiaHerald.jpgభార‌త‌దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా ఓ మ‌హిళ‌కు ఉరి శిక్ష అమ‌లయ్యేలా క‌న‌బ‌డుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రప‌తి కోవింద్ క్ష‌మాభిక్ష పెడితేగాని ఆగే అవ‌కాశం లేదు. డబుల్‌ ఎమ్మే చదివిన షబ్నమ్‌.. ఏడో తరగతితో చదువు ఆపేసిన సలీమ్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడి అతణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరి మతం ఒకటే అయినా.. వర్గాలు వేరు కావడంతో షబ్నమ్‌ కుటుంబసభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదు. తాను ప్రేమించిన వ్య‌క్తికి కుటుంబ స‌భ్యులు పెళ్లికి నిరాక‌రించార‌న్uri;amala akkineni;tiru;india;district;high court;marriage;court;army;letter;murder.;supreme court;april;father;uri;amrohaభార‌త్‌లో తొలిసారిగా మ‌హిళ‌కు ఉరిశిక్ష అమ‌లు చేయ‌బోతున్నారు..భార‌త్‌లో తొలిసారిగా మ‌హిళ‌కు ఉరిశిక్ష అమ‌లు చేయ‌బోతున్నారు..uri;amala akkineni;tiru;india;district;high court;marriage;court;army;letter;murder.;supreme court;april;father;uri;amrohaFri, 19 Feb 2021 08:00:00 GMTఉరి శిక్ష అమ‌లయ్యేలా క‌న‌బ‌డుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రప‌తి కోవింద్ క్ష‌మాభిక్ష పెడితేగాని  ఆగే అవ‌కాశం లేదు. డబుల్‌ ఎమ్మే చదివిన షబ్నమ్‌.. ఏడో తరగతితో చదువు ఆపేసిన సలీమ్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడి అతణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరి మతం ఒకటే అయినా.. వర్గాలు వేరు కావడంతో షబ్నమ్‌ కుటుంబసభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదు.  తాను ప్రేమించిన వ్య‌క్తికి కుటుంబ స‌భ్యులు పెళ్లికి నిరాక‌రించార‌న్న కోపంతో  ష‌బ్న‌మ్, ప్రియుడు స‌లీంతో క‌ల‌సి కుటుంబం మొత్తాన్ని చంపేసింది.  


ఈ సంఘ‌ట‌న 2008 ఏప్రిల్‌ 14న జ‌రిగింది. పాల‌లో మ‌త్తు మందు క‌లిపి వారు స్పృహ కోల్పోయాయ‌క క‌త్తితో గొంతులు కోసి చంపిన‌ట్లుగా ఆమె కోర్టుల్లో తెలిపింది. ఆమె చేతిలో చ‌నిపోయిన వారిలో ఆమె తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు, వదిన, ఆమె చెల్లెలు, 10 నెలల మేనల్లుడు ఉన్నారు. ఫ‌లితంగా13 ఏళ్లుగా  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని  మ‌ధుర జిల్లా జైలులో శిక్ష అనుభ‌విస్తోంది. ఈ కేసులో షబ్నమ్‌కు, ఆమె ప్రియుడు సలీమ్‌కు యూపీలోని అమ్రోహా సెషన్స్‌ కోర్టు మరణ శిక్ష విధించింది. దీనిపై ఆమె అలహాబాద్‌ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీం కోర్టును, ఆపై రాష్ట్రపతిని ఆశ్రయించింది. అన్ని చోట్లా వారికి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. మళ్లీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.


కుటుంబసభ్యులను హతమార్చే నాటికి షబ్నమ్‌ ఏడువారాల గర్భిణి. జైల్లో ఉండగానే ఆమెకు కుమారుడు పుట్టాడు. తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఆ బాలుడు రాష్ట్రపతికి లేఖ  రాశాడు. రాష్ట్ర‌ప‌తి క్ష‌మాభిక్ష పెడుతారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా మరణ శిక్ష భారతదేశంలో చట్టపరమైన శిక్ష. భారతదేశ రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు ఉంది. ఈ హక్కుకు భంగం కలిగించడమే ఉరిశిక్షకు ప్రామాణికం. 1995 నుంచి ఇప్పటి దాకా 9 సార్లు ఈ శిక్ష అమలు చేశారు. హత్య, హత్యాయత్నం, అత్యాచారం చేసి చంపటం, సామూహిక అత్యాచారం, దేశద్రోహం, సైన్యంలో తిరుగుబాటు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్రమైన నేరాలకు భారతదేశంలో మరణ దండన విధిస్తున్నారు.




ఏ బి సి జ్యూస్ గురించి మీకు తెలుసా..?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>