PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kuppam07ead532-6f5d-4c41-bac1-6fdbd7bab275-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kuppam07ead532-6f5d-4c41-bac1-6fdbd7bab275-415x250-IndiaHerald.jpgవైఎస్సార్‌, జగన్ - పులివెందుల, చంద్రబాబు - కుప్పం.. ఇలా కొన్ని కంచుకోటలు ఉంటాయి. అక్కడ ఏ ఎన్నికల్లో అయినా గెలుపు ఒక నాయకుడి వైపే ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ఆ కల చెదిరిపోతోందా.. ఇక చంద్రబాబుకు కుప్పం సేఫ్‌ కాదా.. ఆయన మరో తెలుగు దేశం కంచుకోటను వెదుక్కోవాలా.. ఇప్పుడు ఆసక్తిరేపుతున్న ప్రశ్నలు ఇవి.. ప్రతినాయకుడికీ తనదంటూ ఓ సొంత బలం, సొంత స్థలం ఉంటుంది. రాజకీయ పార్టీ నేతలకు అది చాలా ప్రత్యేకం. అందుకే వైఎస్‌ పులివెందులలోనూ.. చంద్రబాబు కుప్పంలోనూ.. ప్రతిసారీ పోటీ చేస్తుంటారు. అవి ఆయా నేతల కంచుchandrababu-kuppam;cbn;jagan;congress;telugu;kuppam;panchayati;tdp;pulivendula;ycp;partyజగడ్డ: ఇక బాబుకు కుప్పం 'నో సేఫ్‌'.. కొత్త ప్లేస్‌ ఏది.?జగడ్డ: ఇక బాబుకు కుప్పం 'నో సేఫ్‌'.. కొత్త ప్లేస్‌ ఏది.?chandrababu-kuppam;cbn;jagan;congress;telugu;kuppam;panchayati;tdp;pulivendula;ycp;partyFri, 19 Feb 2021 08:00:00 GMTజగన్ - పులివెందుల, చంద్రబాబు - కుప్పం.. ఇలా కొన్ని కంచుకోటలు ఉంటాయి. అక్కడ ఏ ఎన్నికల్లో అయినా గెలుపు ఒక నాయకుడి వైపే ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ఆ కల చెదిరిపోతోందా.. ఇక చంద్రబాబుకు కుప్పం సేఫ్‌ కాదా.. ఆయన మరో తెలుగు దేశం కంచుకోటను వెదుక్కోవాలా.. ఇప్పుడు ఆసక్తిరేపుతున్న ప్రశ్నలు ఇవి.. ప్రతినాయకుడికీ తనదంటూ  ఓ సొంత బలం, సొంత స్థలం ఉంటుంది. రాజకీయ పార్టీ నేతలకు అది చాలా ప్రత్యేకం. అందుకే వైఎస్‌ పులివెందులలోనూ.. చంద్రబాబు కుప్పంలోనూ.. ప్రతిసారీ పోటీ చేస్తుంటారు.

అవి ఆయా నేతల కంచుకోటలుగా చెప్పుకుంటారు. అధికారం మారినా ఆయా స్థానాల్లోవారి గెలుపు మారదు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు అలాంటి కంచుకోటలాంటి కుప్పం చేజారుతోందా అనిపిస్తోంది. తాజా పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపు 74 స్థానాల్లో వైసీపీ గెలిచిందని తెలుస్తోంది. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒక పంచాయతీలో గెలుపొందారు. సహజంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. అయినా సరే..  కుప్పం లాంటి కంచుకోటలో తెలుగు దేశం పరిస్థితి మరీ ఇంతగా ఎందుకు దిగజారిందో చంద్రబాబు ఆలోచించుకోవాల్సిందే.

ఇంతకాలం చంద్రబాబు తనకు ఎదురులేదని భావిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకోవడం తెలుగుదేశం పార్టీకి గట్టి షాకే. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కుప్పంలో ఆ పార్టీ కుప్పకూలిపోయింది. ఇక కుప్పం ఫ్లాష్‌ బ్యాక్ చూస్తే.. 1989లో చంద్రబాబు కుప్పం నుంచి తొలిసారి పోటీచేశారు. అప్పటి నుంచి ఆయనే గెలుస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా  అన్ని ఎన్నికలలో టీడీపీదే అక్కడ విజయం. అలాంటి చోట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఈ రేంజ్‌లో స్వీప్ చేయడం విశేషం. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఈ నియోజకవర్గం సేఫ్ అవుతుందా? లేదా అన్న చర్చ మొదలైంది.




ఏ బి సి జ్యూస్ గురించి మీకు తెలుసా..?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>