PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections8df9dd52-15f2-44b5-ab59-8c5197409e63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections8df9dd52-15f2-44b5-ab59-8c5197409e63-415x250-IndiaHerald.jpgపల్లెలు పట్టణాలు ప్రాంతాలు ఏవైతేనేం. రాజకీయం మాత్రం రంజుగా సాగిపోవాల్సిందే. చదువరులు, కష్ట జీవులు ఎవరుంటేనేం మాటల గారడీలతో అలా ముందుకు పోవాల్సిందే. ఇదీ రాజకీయ జీవుల సిసలైన రాజకీయం. కానీ ఇపుడు అంతా మారింది. రోజులు కూడా మారాయి. jagan-nimagadda-elections;kumaar;korea, south;ganesh kumar vasupalli;రాజీనామా;vishakapatnam;assembly;mla;winner;tdp;ycp;partyపుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?పుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?jagan-nimagadda-elections;kumaar;korea, south;ganesh kumar vasupalli;రాజీనామా;vishakapatnam;assembly;mla;winner;tdp;ycp;partyFri, 19 Feb 2021 08:16:34 GMT
అందుకే రాజకీయం వెనకటి మాదిరిగా చేస్తామంటే కుదిరే వ్యవహారం అసలు కాదు, ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ మేయర్ పీఠం కోసం ఈసారి గట్టిగానే పోటీ ఉండబోతోంది. విశాఖ సిటీలో టీడీపీకి బలముంది. అదే విధంగా ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది. దాంతో ఈ రెండు పార్టీల మధ్య విశాఖ మేయర్ పీఠం కోసం ఢీ అంటే ఢీ అన్న పోటీ కచ్చితంగా జరగబోతోంది.

విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే కచ్చితంగా అర్ధ శతకం కొట్టాల్సిందే. అంటే మొత్తం జీవీఎంసీ పరిధిలో ఉన్న 98 డివిజన్లలో యాభై డిజిజన్లు ఏ పార్టీ వశం అవుతాయో వారిదే విజయం. వారిదే విశాఖ మేయర్ సీటు. జీవీఎంసీ పరిధిలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో నాలుగు టీడీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంటే మరో నాలుగు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇందులో విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జై కొట్టేశారు.

దాంతో పాటు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గా ఉన్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సరిగ్గా జీవీఎంసీ ఎన్నికల ముందే రాజీనామా చేశారు. ఉక్కు పోరాటం కోసం తన పదవిని వదిలేసుకున్నారు. దాంతో ఇపుడు చూస్తే వైసీపీకి బలం గట్టిగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఇది జనాల తీర్పు. దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఓటర్ల తీర్పు. అందువల్ల అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ అంత ఈజీ కాదనే అంటున్నారు. చూడాలి మరి ఎవరి విజేత అవుతారో. ఈ పోరులో ఎవరిని మేయర్ వరిస్తుందో.






నీ పెద‌వి కొరుకడం నేర్పంటూ అడిగిన అబ్బాయ్‌... వెంట‌నే ఒప్పేసుకున్న ప్రియా వారియ‌ర్‌..

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>