PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/weekend-lockdown-in-amaravathi89127d8a-f141-4a94-b448-109d573454c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/weekend-lockdown-in-amaravathi89127d8a-f141-4a94-b448-109d573454c2-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మహారాష్ట్ర లాంటి కొన్ని చోట్ల మాత్రం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలోలాగానే వీకెండ్ లాక్ డౌన్ పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతండటంతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వీకెండ్ లాక్ ‌డౌన్‌ విధిస్తున్నట్టు కలెక్టర్‌ శైలేష్‌ నావల్‌ ప్రకటించారు. శనివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు అన్ని మార్కెట్లు, షాamaravathi lockdown;mandula;amaravati;maharashtra - mumbai;district;maharashtraఅమరావతిలో మళ్లీ లాక్ డౌన్.. అధికారుల కఠిన నిర్ణయంఅమరావతిలో మళ్లీ లాక్ డౌన్.. అధికారుల కఠిన నిర్ణయంamaravathi lockdown;mandula;amaravati;maharashtra - mumbai;district;maharashtraFri, 19 Feb 2021 08:00:00 GMTమహారాష్ట్ర లాంటి కొన్ని చోట్ల మాత్రం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలోలాగానే వీకెండ్ లాక్ డౌన్ పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతండటంతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వీకెండ్ లాక్ ‌డౌన్‌ విధిస్తున్నట్టు కలెక్టర్‌ శైలేష్‌ నావల్‌ ప్రకటించారు. శనివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు అన్ని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఇతర చిన్న దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించారు. పాల ఉత్పత్తులు, మందుల షాపులు వంటి.. అత్యవసర సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారాయన.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరణాల రేటు పూర్తిగా పడిపోయింది. కొత్త కేసులు కూడా వెలుగులోకి రావడంలేదు. అయితే వారం రోజులుగా మహారాష్ట్రలో మాత్రం కొత్త కేసులు పెరగడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. వీకెండ్ లాక్ డౌన్ తో తొలి అడుగు వేశారు. మిగతా రోజుల్లో కూడా ఆంక్షలు విధించారు. శని, ఆదివారాలు మినహా  మిగతా రోజుల్లో హోటళ్లు, రెస్టారంట్లతో పాటు అన్ని దుకాణ సముదాయాలూ రాత్రి 8గంటల వరకే తెరిచి ఉంచాలని ఆదేశించారు అమరావతి జిల్లా అధికారులు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీకెండ్‌ లాక్‌ డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఈ ఆంక్షలు  మరింత కఠినంగా ఊండకూడదని ప్రజలు భావిస్తే.. ముందు జాగ్రత్తగా, కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.


వీకెండ్ లాక్ డౌన్ తో పాటు.. ఇతర విషయాల్లో కూడా గతంలో మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతానికి కేసులు ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లాలో  స్విమ్మింగ్‌ పూల్స్‌, ఇండోర్‌ క్రీడలకు సైతం అనుమతిలేదంటున్నారు అధికారులు. మత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 4787 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. 


ఏ బి సి జ్యూస్ గురించి మీకు తెలుసా..?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>