PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/farmers120529ee-e01f-45c8-813f-97125cd134ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/farmers120529ee-e01f-45c8-813f-97125cd134ea-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో "రైతు బంధు" పథకం ఒకటి. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పతాకంపై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని వేరు వేరు పేర్లతో అమలు చేస్తున్నాయి. ఏపీలో ఇదే పథకాన్ని కొన్ని మార్పులు చేసి రైతు భరోసా పేరుతో అమలు చేస్తున్నారు. ఇక కేంద్రంలో సైతం ఈ పథకాన్ని కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అయితే కేంద్రం ఈ పథకాన్ని ఐదెకరాల లోపు రైతులకే ఇస్తోంది. ఇక రైతు బంధు విషయానికొస్తే ఏడాదికి ఒక ఎకరానికి గాను రూ.10 వేలు ఇస్తుంది.raithu bandu;adah sharma;amala akkineni;telangana;cm;chief minister;minister;letter;central government;etela rajenderఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?raithu bandu;adah sharma;amala akkineni;telangana;cm;chief minister;minister;letter;central government;etela rajenderFri, 19 Feb 2021 19:49:00 GMTతెలంగాణ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో "రైతు బంధు" పథకం ఒకటి. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పతాకంపై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని వేరు వేరు పేర్లతో అమలు చేస్తున్నాయి. ఏపీలో ఇదే పథకాన్ని కొన్ని మార్పులు చేసి రైతు భరోసా పేరుతో అమలు చేస్తున్నారు. ఇక కేంద్రంలో సైతం ఈ పథకాన్ని కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అయితే కేంద్రం ఈ పథకాన్ని ఐదెకరాల లోపు రైతులకే ఇస్తోంది. ఇక రైతు బంధు విషయానికొస్తే ఏడాదికి ఒక ఎకరానికి గాను రూ.10 వేలు ఇస్తుంది. ఈ డబ్బులను రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున అందజేస్తుంది. అయితే ఈ పథకంలో మార్పులు చేయాలని కొన్ని రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి. ఇటివలే ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా రైతు బంధు పథకం లో మార్పులు చేయాలని రైతులు కోరుతున్నారని..ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెలతామని అన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాబారెడ్డి కొత్త డిమాండ్ ను తీసుకువచ్చారు. ఐదెకరాల భూమి ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వాలని కోరుతూ సీఎంఓ పర్సనల్ సెక్రటరీ కి ఆయన లేఖ రాశారు.

ఈ ఆర్థికసంవత్సరంలో 59.21లక్షల మంది ఖాతాల్లోకి రూ.15,233 వేల కోట్ల రూపాయలు జమచేసినట్టు పేర్కొన్నారు. కాగా పెద్ద రైతులు వ్యవసాయం చేయకుండానే రైతు బంధు సహాయాన్ని పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులు 53.54 లక్షల మంది ఉన్నారని పథకాన్ని వారికి మాత్రమే వర్తింపచేస్తే రూ. 5,111 కోట్లు ఖర్చు అవుతాయని..దాంతో 10వేల కోట్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఏఏ సంధర్బంగా కేంద్రం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పొలం సాగు చెయ్యని వారికి..పొలాన్ని కౌలుకు ఇచ్చిన వారికి రైతు బంధు ఇవ్వొద్దని లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా రాజకీయ పదవుల్లో ఉన్నవారికి..పెన్షన్ పొందేవారికి కూడా పథకాన్ని మినహాయించాలని సూచించారు. ఇక ఈ పతాకంపై ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికే భూమి లేని పేద రైతుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పదులు వందల ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇస్తే వాళ్ళు ఆ డబ్బులను విలాసాలకు ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపించాయి.


ఏపీలో మత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>