PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu1e877fd6-b098-4562-bd96-6f8cd9790bf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu1e877fd6-b098-4562-bd96-6f8cd9790bf2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ మూడు దశల స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించింది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయి అనే చెప్పాలి. అయితే అధికార పార్టీ మరింత ప్రభావం చూపించడమే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న అంశంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమాన్ని చాలా వరకు కూడా ముందుకు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లchandrababu;telugu desam party;amaravati;andhra pradesh;telugu;vishakapatnam;local language;ycp;partyఅమరావతిని వదిలేద్దాం... చంద్రబాబు ముందు ప్రతిపాదనలుఅమరావతిని వదిలేద్దాం... చంద్రబాబు ముందు ప్రతిపాదనలుchandrababu;telugu desam party;amaravati;andhra pradesh;telugu;vishakapatnam;local language;ycp;partyFri, 19 Feb 2021 08:10:53 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ మూడు దశల స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించింది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయి అనే చెప్పాలి. అయితే అధికార పార్టీ మరింత ప్రభావం చూపించడమే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న అంశంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమాన్ని చాలా వరకు కూడా ముందుకు నడిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాల్లో కాస్త తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీచాయి అనే ప్రచారం జరిగింది. గుంటూరు జిల్లాలో చాలా మంది నేతలు కూడా పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అధికార వైసీపీ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అని... ప్రజల్లోకి కూడా వచ్చే ప్రయత్నం చేయటం లేదని అమరావతి ఉద్యమం విషయంలో ఇప్పుడు చంద్రబాబు ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న ఫలితాలు రాకపోవడంతో వాళ్ళలో కూడా ఆందోళన మొదలైంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడవచ్చు. అందుకే ఈ ఉద్యమం వద్దు అని చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 3 రాజధానులు విషయం లో కీలకమైన విశాఖ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఆదరించారు. దీనితో విశాఖ మీద ఫోకస్ చేసారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే తెలియనుంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి.


ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>