PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elecions51c001c6-e00f-4adb-bb37-29e14911476b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elecions51c001c6-e00f-4adb-bb37-29e14911476b-415x250-IndiaHerald.jpgఒకపక్క రసవత్తరంగా సాగుతున్న పల్లె పోరు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికలు పూర్తిగా మరో విడత ఎన్నికలు ఆదివారం జరుగుతున్నాయి. ఇక ఈ పోరు ముగియగానే పుర పోరు కూడా మొదలవుతుంది. దాదాపు 11 నెలల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం కార్పొరేషన్ తో పాటు పామిడి మినహా ఎనిమిది మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీలో పోరు జరగనుంది. గతం లోనే వేసిన నామినేషన్ లను మార్చి రెండవ తేదీన ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాతjagan nimmagadda elecions;balakrishna;hari;hari music;rami reddy;sridhar;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;district;panchayati;mla;usha mulpuri;tdp;ycp;kadiri;march;reddy;puttaparthiపుర పోరు : అనంత లెక్కలేంటి ఎవరి సత్తా ఎలా ఉంది ?పుర పోరు : అనంత లెక్కలేంటి ఎవరి సత్తా ఎలా ఉంది ?jagan nimmagadda elecions;balakrishna;hari;hari music;rami reddy;sridhar;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;district;panchayati;mla;usha mulpuri;tdp;ycp;kadiri;march;reddy;puttaparthiFri, 19 Feb 2021 13:00:00 GMTఒకపక్క రసవత్తరంగా సాగుతున్న పల్లె పోరు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికలు పూర్తిగా మరో విడత ఎన్నికలు ఆదివారం జరుగుతున్నాయి. ఇక ఈ పోరు ముగియగానే పుర పోరు కూడా మొదలవుతుంది. దాదాపు 11 నెలల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం కార్పొరేషన్ తో పాటు పామిడి మినహా ఎనిమిది మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీలో పోరు జరగనుంది. గతం లోనే వేసిన నామినేషన్ లను మార్చి రెండవ తేదీన ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ గడువు ఉంటుంది. మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటల తరువాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 

మార్చి 10వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా 14 వ తేదీన రిజల్ట్స్ ప్రకటిస్తారు. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్ అలాగే హిందూపురం ధర్మవరం, కదిరి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీలలో కూడా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పామిడి మేజర్ పంచాయతీ కావాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల బరిలో 2280 మంది అభ్యర్థులు ఉన్నారు. 

అయితే నామినేషన్ ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో చివరికి ఎంత మంది బరిలో ఉంటారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికీ అనంతపురం జిల్లా విషయానికి వస్తే దాదాపుగా అధిక భాగం వైసిపి ఎమ్మెల్యేలే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న అనంతపురం కార్పొరేషన్ కి సంబంధించిన అర్బన్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన అనంత వెంకట రామి రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నారు. 

అలాగే ధర్మవరానికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అలాగే పుట్టపర్తి విషయానికి వస్తే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కదిరికి పీ వీ సిద్ధారెడ్డి, రాయదుర్గంకి కాపు రామచంద్రారెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం ఉష శ్రీ చరణ్, మడకశిర తిప్పేస్వామి ఇలా వీరంతా వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక్కరే టిడిపి తరఫున ఉన్నారు. దీంతో ఆయా చోట్ల వైసీపీ ప్రభావం గట్టిగానే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?




రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>