MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/satisfied-for-the-first-time-with-the-same-swingd420cf4f-a5d0-4394-8d09-c42c26e2122a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/satisfied-for-the-first-time-with-the-same-swingd420cf4f-a5d0-4394-8d09-c42c26e2122a-415x250-IndiaHerald.jpgహిట్‌ వస్తే హీరో క్రెడిట్, ఫ్లాప్ అయితే దర్శకుడి వల్లే సినిమా పోయిందని కామెంట్ చేయడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్లు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం డెబ్యూతోనే స్టార్డమ్ తెచ్చుకున్నారు. భారీ అవకాశాలు అందుకుంటున్నారు. టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన సినిమా 'ఉప్పెన'. చిన్న సినిమాగా మొదలై, మూడు రోజుల్లోనే 30 కోట్ల వరకు కలెక్ట్ చేసి, ట్రేడ్‌ పండిట్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. డెబ్యూలోనే బుచ్చిబాబు అదరగొట్టాడనే ప్రశంషలు వsatisfied for the first time with the same swing;suresh;bhaskar;sandeep;tarun;bollywood;tollywood;cinema;baba bhaskar;director;hero;arjun 1;reddy;tarun kumarతొలిసారి సంతృప్తిపరిచారు.. అదే ఊపుతో..!తొలిసారి సంతృప్తిపరిచారు.. అదే ఊపుతో..!satisfied for the first time with the same swing;suresh;bhaskar;sandeep;tarun;bollywood;tollywood;cinema;baba bhaskar;director;hero;arjun 1;reddy;tarun kumarFri, 19 Feb 2021 20:00:00 GMTహీరో క్రెడిట్, ఫ్లాప్ అయితే దర్శకుడి వల్లే సినిమా పోయిందని కామెంట్ చేయడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్లు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం డెబ్యూతోనే స్టార్డమ్ తెచ్చుకున్నారు. భారీ అవకాశాలు అందుకుంటున్నారు.

టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన సినిమా 'ఉప్పెన'. చిన్న సినిమాగా మొదలై, మూడు రోజుల్లోనే 30 కోట్ల వరకు కలెక్ట్ చేసి, ట్రేడ్‌ పండిట్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. డెబ్యూలోనే బుచ్చిబాబు అదరగొట్టాడనే ప్రశంషలు వస్తున్నాయి. అలాగే భారీ అవకాశాలు కూడా అందుకుంటున్నాడు బుచ్చిబాబు. నెక్ట్స్‌ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్‌లోనే తీయబోతున్నాడు.

'అర్జున్‌ రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ వంగ. ఫస్ట్ మూవీతోనే పాథ్‌ బ్రేకింగ్‌ డైరెక్టర్‌ అనే ప్రశంసలు కూడా తెచ్చుకున్నాడు. ఈ ఇమేజ్‌తోనే బాలీవుడ్‌ బడా బ్యానర్ టీ-సీరీస్‌లో బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు సందీప్‌ వంగ. 'కభీర్‌ సింగ్'తో షాహిద్‌ కపూర్‌ని బిలియన్‌ క్లబ్‌లో చేర్చిన సందీప్, ఇప్పుడు టీ-సీరీస్‌లోనే రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' తీస్తున్నాడు.

ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డ్‌ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. 'పెళ్లిచూపులు'తో మెగాఫోన్ పట్టిన తరుణ్‌భాస్కర్‌కి ఈ మూవీతో సూపర్‌ క్రేజ్ వచ్చింది. ఈ ఇమేజ్‌తోనే టాలీవుడ్‌ స్టార్‌ బ్యానర్‌ సురేష్ ప్రొడక్షన్స్‌లో 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా చేశాడు. ఇప్పుడు వెంకటేశ్‌తో ఒక స్పోర్ట్స్‌ డ్రామా కూడా చేయబోతున్నాడు.

మొత్తానికి సింగిల్ సినిమాతో స్టార్డమ్ తెచ్చేసుకుంటున్నారు మన దర్శకులు. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు ఇప్పుడు అందరి నోళ్లలోనానుతున్నాడు. ఇదే ఊపుతో మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు ఈ క్రేజీ డైరెక్టర్. సందీప్ వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకొని బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేశాడు.





ఏపీలో మత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>