MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-shocking-uppena-remake-for-vijay-son6766e18e-3dde-4e2e-8a9a-880e07063d0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-shocking-uppena-remake-for-vijay-son6766e18e-3dde-4e2e-8a9a-880e07063d0f-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ కు డివైడ్ టాక్ వచ్చినా కేవలం వారం రోజులలో ఆ మూవీకి 200 కోట్లు కలెక్షన్స్ రావడంతో మరోసారి విజయ్ స్టామినా బయటపడింది. ఇప్పుడు ఈ ఆనందం చాలదు అన్నట్లుగా మరొక సంచలన వార్త విజయ్ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయమై ఒక స్థిర నిర్ణయం తీసుకున్న విజయ్ తన కొడుకుకు సరిపోయే కథల కోసం అన్వేషణ ప్రారంభించి దానికోసం అనేకమంది దర్శకులు రచయితలతో చuppena;nithin;vijay;vikram;cinema;telugu;rajani kanth;arjun reddy;kollywood;tamil;remake;tamilnadu;hero;joseph vijay;arjun 1;nithin reddy;reddy;varasudu;masterకొడుకు కోసం ఉప్పెన చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్న విజయ్ !కొడుకు కోసం ఉప్పెన చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్న విజయ్ !uppena;nithin;vijay;vikram;cinema;telugu;rajani kanth;arjun reddy;kollywood;tamil;remake;tamilnadu;hero;joseph vijay;arjun 1;nithin reddy;reddy;varasudu;masterFri, 19 Feb 2021 09:00:00 GMTతమిళ స్టార్ హీరో  విజయ్  లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ కు డివైడ్ టాక్ వచ్చినా కేవలం వారం రోజులలో ఆ మూవీకి 200 కోట్లు కలెక్షన్స్ రావడంతో మరోసారి విజయ్ స్టామినా బయటపడింది. ఇప్పుడు ఈ ఆనందం చాలదు అన్నట్లుగా మరొక సంచలన వార్త విజయ్ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.


కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయమై ఒక స్థిర నిర్ణయం తీసుకున్న విజయ్ తన కొడుకుకు సరిపోయే కథల కోసం అన్వేషణ ప్రారంభించి దానికోసం అనేకమంది దర్శకులు రచయితలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్.


ఈ పరిస్థితులలో విజయ్ దృష్టికి కొందరు లేటెస్ట్ గా విడుదలైన ‘ఉప్పెన’ మూవీ మ్యానియా గురించి వివరించడమే కాకుండా ఆ మూవీ రీమేక్ విజయ్ కొడుకు కు అన్నివిధాల సరిపోతోంది అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో నితిన్ ‘ఉప్పెన’ మూవీ నిర్మాతలతో మాట్లాడి ఈ మూవీ స్పెషల్ షోను తనకోసం చెన్నైలో వేయించుకునే ఆలోచనలలో ఉన్నాడు అని కోలీవుడ్ వార్తలు వ్రాస్తోంది.



ఈ వార్తలే నిజం అయితే ‘ఉప్పెన’ మరో సంచలనం సృష్టించింది అనుకోవాలి. అయితే తెలుగులో ఘన విజయం సాధించిన చాల సినిమాలు తమిళంలో ఫెయిల్ అయ్యాయి. కోలీవుడ్ టాక్ హీరో విక్రమ్ తన కొడుకును హీరోగా నిలబెట్టాలని అర్జున్ రెడ్డి మూవీని తమిళంలో రీమేక్ చేస్తే ఆ మూవీ ఫ్లాప్ గా మారింది. దీనికితోడు తెలుగు ప్రేక్షకులు ఆరాధించే విధంగా తమిళనాడులో టాప్ హీరోల వారసుల హవా లేదు. రజినీకాంత్ కమలహాసన్ లకు కొడుకులు లేకపోవడంతో ఈ వారసత్వ క్రేజ్ ఏర్పడలేదు. విక్రమ్ ప్రయత్నించినా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. దీనితో విజయ్ వారసుడుని ఏ మేరకు తమిళ ప్రజలు అంగీకరిస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..  





యాపిల్,క్యారెట్, బీట్రూట్, బొప్పాయిలో ఏ ఏ పోషకాలు ఉన్నాయో మీకు తెలుసా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?

కాపు వేద‌న‌: కాపు నేత‌ల వార‌సులు కాన‌రారే..!

పుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?

పుర పోరు: ఆ మేయ‌ర్ పీఠం ఎఫెక్ట్‌.. చంద్ర‌బాబుకు త‌మ్ముళ్లు చుక్క‌లు చూపించేస్తున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>