HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healtha964de41-85e4-42ba-82e3-d76e7eb0dbf3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healtha964de41-85e4-42ba-82e3-d76e7eb0dbf3-415x250-IndiaHerald.jpgమ‌హిళ‌లు అనుభ‌వించే అతి సాధార‌ణ రొమ్ము సంబంధిత స‌మ‌స్య రొమ్ము నొప్పి. 70 శాతం మంది మ‌హిళ‌లు త‌మ జీవితంలో ఏదో ఒక స‌మ‌యంలో ఈ నొప్పికి గుర‌వుతుంటారు. రుతుస్రావాలు, అంటువ్యాధులు, చ‌నుబాలివ్వ‌డం, మంట వ‌ల్ల నొప్పి క‌ల‌గ‌వ‌చ్చు. ఇది ఎక్కువ‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చాలా మంది మ‌హిళ‌లు ఇది రొమ్ము క్యాన్స‌రేమోన‌ని ఆందోళ‌న చెందుతారు. అది చాలా అరుదైన విష‌యం.health;jeevitha rajaseskhar;tara;nijamవక్షోజాల్లో గడ్డలుంటే..వక్షోజాల్లో గడ్డలుంటే..health;jeevitha rajaseskhar;tara;nijamFri, 19 Feb 2021 01:24:06 GMT
రొమ్ము తడిమితే చేతికి గడ్డలు తగులుతున్నాయని చాలామంది మ‌హిళ‌లు కంగారుప‌డి వైద్యుల ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుతారు. పాల‌గ్రంథినే గ‌డ్డ అనుకొని అపోహ‌ప‌డ‌తారు. దానికి కంగారుప‌డాల్సిన అవ‌స‌రంలేదు.

రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రెండువేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే అనిపిస్తాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి, పరీక్షించుకుంటే నిజంగానే గడ్డలు ఉన్నాయా? లేదా? అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఆ సందేహం ఉంటే  వైద్యులు మామోగ్రఫీని సూచిస్తారు.

సాధారణంగా చిన్నవయసులో చేతికి తగిలే గడ్డలు ఫైబ్రోఎడినోమా కావచ్చు. అవి తేలిగ్గా రొమ్ములో తగులుతాయి. చనుమొనల నుంచి ఎలాంటి స్రావాలూ విడుదలకావు. పెద్దగా ఉన్న‌వాటితో సమస్యలొస్తుంటే తప్ప చికిత్స అవసరంలేదు.

కొన్నిసార్లు వక్షోజాల్లోని కొవ్వంతా గడ్డకట్టి  గడ్డలా తయారవుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు కూడా గడ్డలా చేతికి తగులుతుంది. అప్పుడు మాత్రం జ్వరం, గడ్డ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఆ గడ్డ గట్టిగా రాయిలా వక్షోజం లోపల అతుక్కుని ఉంటే పైన చర్మం కూడా దానికి అతుక్కుపోయి, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలూ వస్తుంటే క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయ‌కుండా త‌క్ష‌ణ‌మే వైద్యుణ్ని సంప్ర‌దించాలి.

ప్రతినెలా నెలసరి అయిపోయిన వెంటనే వక్షోజాలను పరీక్షించి చూసుకోవాలి. ఏడాదికోసారి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉన్న స్త్రీలు 35 సంవత్సరాల నుంచి, ఇతరులు 40 సంవ‌త్స‌రాల నుంచి ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి.





అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>