MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith15f1aca7-c1d3-4092-a33a-f73193b5c4d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith15f1aca7-c1d3-4092-a33a-f73193b5c4d1-415x250-IndiaHerald.jpgఅజిత్ .. ఓ మంచి నటుడు. అంతుకు మించి మనసున్న మారాజు. మృదు స్వభావి. ఎవ్వరినీ నొప్పించడు. తానూ నొచ్చుకోడు. ఇలా ఎంత చెప్పినా అజిత్ గురించి తక్కువే. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగాడు. కష్టాలను ఎదురొడ్డి తనను తాను నిరూపించుకున్నాడు. సక్సెస్ రుచి చూసినా .. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే సూత్రాన్ని పాటించాడు. ajith;ajith kumar;cinema;telugu;tamil;bike;hero;success;ajit pawar;vఅజిత్ బాల్యంలో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే కన్నీళ్లే..!అజిత్ బాల్యంలో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే కన్నీళ్లే..!ajith;ajith kumar;cinema;telugu;tamil;bike;hero;success;ajit pawar;vFri, 19 Feb 2021 14:15:12 GMTఅజిత్ ..  ఓ మంచి నటుడు. అంతుకు మించి మనసున్న మారాజు. మృదు స్వభావి. ఎవ్వరినీ నొప్పించడు. తానూ నొచ్చుకోడు. ఇలా ఎంత చెప్పినా అజిత్ గురించి తక్కువే. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగాడు. కష్టాలను ఎదురొడ్డి తనను తాను నిరూపించుకున్నాడు. సక్సెస్ రుచి చూసినా .. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే సూత్రాన్ని పాటించాడు.

అజిత్ అనే పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి. సికింద్రాబాద్ లో పుట్టిన అజిత్.. మొదట తెలుగు సినిమాలో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా పరాజయం కావడంతో తమిళ సినిమాలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. సినీ పరిశ్రమలో స్టార్  హీరోగా ఎదిగాడు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించాడు. అన్నింటికీ మించి మంచి మనసున్న హీరోగా తన ఉదారతను చాలా సందర్భాల్లో చాటుకున్నాడు.

అలాంటి హీరో.. చిన్నతనంలో అష్టకష్టాలు పడ్డాడు. అజిత్ ఇవాళ ఈ స్థాయిలో ఉండి పదిమందికి సాయం చేస్తున్నాడంటే తను పడిన కష్టాలను మర్చిపోలేకపోవడమే. అజిత్ పడిన కష్టాల గురించి ఎస్పీ బాలసుబ్రమణ్యం పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు అజిత్. తనకు అవకాశాలు కూడా అంత ఈజీగా రాలేదు. బాలు కొడుకు చరణ్, అజిత్ ఇద్దరూ క్లాస్ మేట్స్. అజిత్ కెరీర్ స్టార్టింగ్ లో యాడ్స్ షూటింగ్ కి వెళ్లేటప్పుడు సెంటిమెంట్ గా చరణ్ షూస్, డ్రెస్ వేసుకుని వెళ్లేవాడట.

అజిత్ కి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ప్రమాదాలు జరగడం వల్ల బైక్ రేసింగ్ ని వదిలేయాల్సి వచ్చింది. అజిత్ ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. వివాదాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడని ఎస్పీ బాలు చెప్పాడు. తెలుగులో సక్సెస్ కాలేకపోయినా.. తమిళ సినీ పరిశ్రమలో మంచి రోల్స్ చేశాడు. వాటినే తెలుగులో డబ్బింగ్ చేసిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలా అజిత్ తెలుగు, తమిళంలోనే కాదు యావత్ దేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.


సుమంత్ వద్దన్న సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడంట!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>